Bible Quiz in Telugu Topic wise: 71 || తెలుగు బైబుల్ క్విజ్ ("World Heritage day" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. దేవుడు తన "స్వాస్థ్యమును" ఎవరికిచ్చియున్నాడు?
ⓐ యూదావారికి
ⓑ ఇశ్రాయేలుకు
ⓒ అన్యజనులకు
ⓓ రాజులకు
2. యెహోవా వలన సేవకులకు ఏది స్వాస్థ్యమగును?
ⓐ సంపద
ⓑ నీతి
ⓒ న్యాయము
ⓓ నిధులు
3. దేవుడు తన స్వాస్థ్యములో శేషించిన వారి వేటిని పరిహరించును?
ⓐ అవిధేయతలను
ⓑ ఆక్రమములను
ⓒ దోషములను
ⓓ అన్యాయములను
4. యెహోవానామమందు ఏమి గలవారి స్వాస్థ్యము దేవుడు అనుగ్రహించును?
ⓐ వినయము
ⓑ భయభక్తులు
ⓒ విధేయత
ⓓ నమ్రత
5. యెహోవా తన స్వాస్థ్యమును ఏమి చేసెను?
ⓐ త్రోసివేసెను
ⓑ మరచెను
ⓒ విడచెను
ⓓ విసర్జించెను
6. మన తండ్రియైన ఎవరి స్వాస్థ్యమును దేవుడు మన యనుభవములోనికి తెచ్చును?
ⓐ ఇస్సాకు
ⓑ యాకోబు
ⓒ యోసేపు
ⓓ ఎఫ్రాయిము
7. ఎక్కడ ప్రత్యేకముగా నివసించు వారి స్వాస్థ్యమును మేపుమని యెహోవా సెలవిచ్చెను?
ⓐ కొండలలో
ⓑ ఎడారిలో
ⓒ అడవిలో
ⓓ లోకములో
8. ఎవరు యెహోవా స్వాస్థ్యమును పాడు చేసెను?
ⓐ యాకోబు ఇంటివారు
ⓑ ఇశ్రాయేలు ఇంటివారు
ⓒ పై రెండూ
ⓓ పైవేమీ కాదు
9. యెహోవా తన స్వాస్థ్యము అలసి యుండగా ఏమి చేసెను?
ⓐ బలపరచెను
ⓑ తృప్తిపరచెను
ⓒ కాపాడెను
ⓓ సహాయపడెను
10. యెహోవా తన స్వాస్థ్యమును ఏమి చేయడు?
ⓐ విడనాడడు
ⓑ ఎడబాయడు
ⓒ మరచిపోడు
ⓓ పైవన్నియు
11. ఏశావు స్వాస్థ్యమును దేవుడు అరణ్యమందున్న వేటి పాలు చేసెను?
ⓐ తోడేళ్ళు
ⓑ నక్కల
ⓒ ఎలుగుబంట్లు
ⓓ కుక్కల
12. ఎవరి స్వాస్థ్యములను దేవుడు తన ప్రజలకు ఇచ్చెను?
ⓐ రాజుల
ⓑ చక్రవర్తుల
ⓒ ధనవంతుల
ⓓ అన్యజనుల
13. ఎవరి వంతు వారి స్వాస్థ్యములను పొందిన వారెవరు?
ⓐ లేవీయులు
ⓑ మోషే-యెహోషువాలు
ⓒ ఇశ్రాయేలీయులు
ⓓ యాజకులు
14. యెహోవా శాసనములు ఎటువంటివి?
ⓐ నిత్యస్వాస్థ్యములు
ⓑ మేలుకరము
ⓒ నమ్మదగినవి
ⓓ జ్ఞానకరమైనవి
15. దేవుడు మనకనుగ్రహించు స్వాస్థ్యము ఎక్కడ భద్రము చేయబడియున్నది?
ⓐ మందిరమందు
ⓑ పర్వతములందు
ⓒ ఇహలోకమందు
ⓓ పరలోకమందు
Result: