1. "Innocent"అనగా నేమి?
2. యోనాతాను నిరపరాధియైన ఎవరి ప్రాణము తీయవద్దని సౌలుకు చెప్పెను?
3. నిరపరాధులనైనను, నీటిమంతులనైనను ఏమి చేయకూడదని యెహోవా చెప్పెను?
4. నిర్దోషులు ఎవరి స్థితి చూచి కలవరపడుదురు?
5. నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని ఎవరు అనెను?
6. ఎవరు తన దృష్టికి తాను నీటిమంతుడై యున్నాడని ఎరిగి అతని స్నేహితులు తెలుసుకొనిరి?
7. ఇతని యందు ఏ కపటము లేదని యేసు ఎవరి గురించి చెప్పెను?
8. సజ్జనుడు నీతిమంతుడునైన యూదుల సభ్యుడు ఎవరు?
9. నీతిమంతుడైన యేసు జోలికి పోవద్దని ఎవరి భార్య అతనికి వర్తమానము పంపెను?
10. నీతిమంతుడు దేవునికీ భయపడువాడైన శతాధిపతి ఎవరు?
11. నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము రమ్మని ఎవరు అనెదరు?
12. యెరూషలేము ఆ కొననుండి ఈ కొనవరకు నిరపరాధుల రక్తము బహుగా ఒలికించినదెవరు?
13. యెహోవా తన నామమును ఎలా నుచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు?
14. యెహోవా పరిశుద్ధ పర్వతము మీద ఎక్కదగిన వాడు నిరపరాధిని చంపుటకు ఏమి పుచ్చుకొనడు?
15. పవిత్రుడు, నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా నున్న యేసు మనకు సరిపోయిన ఎవరై యున్నాడు?
Result: