1. యెహోవా దినమందు ఎక్కడ నుండి "పాలు"ప్రవహించును?
2. యెహోవా దినమున ఒకడు పెంచుకొనిన ఏమి సమృద్ధిగా "పాలు"ఇచ్చును?
3. వేటి యొక్క పచ్చి "పాలను "యెహోవా ఇచ్చును?
4. "పాలిచ్చు"గొర్రెలను యెహోవా నడిపించును?
5. తన దగ్గరకు వచ్చిన వారికి ఎవరు వెన్నను "పాలను"సిధ్ధము చేసెను?
6. తనను దాహమడిగిన సీసెరాకు "పాల బుడ్డి" విప్పి ఇచ్చినదెవరు?
7. మన ఆహారమునకు, మన పనికత్తెల జీవనమునకు వేటి "పాలు" సమృద్ధియగును?
8. "పాలు" తరచగా ఏమి పుట్టును?
9. పౌలు ఏ సంఘమును "పాలతోనే"పెంచవలసి వచ్చెను?
10. "పాలు" త్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు అని పౌలు ఏ సంఘము గూర్చివ్రాసెను?
11. ఎవరి "పాలు"కుడిచెదరని యెహోవా తన జనులతో అనెను?
12. ఒకడు "పాలు"పోసినట్లు నన్ను పోసితివి గదా అని ఎవరు యెహోవాతో అనెను ?
13. "పాలు" త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్యవిషయములో ఏమి లేనివాడై యున్నాడు?
14. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఏమి అను "పాల"వలన రక్షణ విషయములో ఎదుగవలెను?
15. "పాలు" తేనెలు ప్రవహించు దేశము ఏది?
Result: