Bible Quiz in Telugu Topic wise: 78 || తెలుగు బైబుల్ క్విజ్ ( World parents day సందర్భంగా బైబిల్ క్విజ్)

1: అక్సను తండ్రి తల్లి యొక్క పేర్లేమిటి?
A కనజు; ఎఫ్రాతా
B మెరెజు; గెరెషు
C యెరెదు ; శెరాయా
D కాలేబు ; మయకా
2 . యెష్షయి తండ్రియైన ఓబేదు తండ్రితల్లి పేర్లేమిటి?
A మక్మెషు; శెరహు
B ఓదేదు; అజూబా
C బోయజు: రూతు
D హూరు మిర్యాము
3 . యబ్బేజు యొక్క తండ్రి తల్లి పేరులు తెలుపుము?
A అష్షూరు ; హెలా
B షుప్పీము ; నయరా
C గరేతు ; జుబేదా
D మోరాము ; జెబెరు
4.ఎవరి తండ్రి ఆమోరీయుడు మరియు తల్లి హిత్తీయురాలు?
A షాంరోను
B యెరూషలేము
C అష్షూరు
D ఐగుప్తు
5 . ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన యరొబాము తండ్రి తల్లి పేరేమిటి?
A మాయోతు ; జెరెషు
B నాహాషు: యెరెదు
C నెబాతు; జెరూహా
D షూహాను; గెహరు
6. రాజ్యపాలన కొరకు తన కుమారుని కుమారులను నాశనము చేసిన అతల్యా తండ్రి తల్లి పేర్లేమిటి?
A ఆహాబు; యెజెబెలు
B నాహాషు ; యెరుషా
C మనషే ; యెదీద్యా
D హెరెషు; హమూటలు
7. రాజైన దర్యావేషు యొక్క తండ్రి తల్లి యొక్క పేరులు తెలుపుము?
A అహష్వేరోషు ఎస్తేరు
B నెబుకద్నెజరు ; షాపాజు
C అర్తహషస్త ; హెనీమా
D బెల్షస్సరు ; షూయాను
8. యాజకుడైన ఎలియాజరు యొక్క తండ్రి తల్లి ఎవరు?
A హూరు ; మిర్యాము
B మోషే ; సిప్పోరా
C అహరోను ; ఎలీషెబ
D అమ్రాము ; యోకెబెదు
9. రాజును నేనే యని గర్వించిన అదోనియా తండ్రి తల్లి పేరేమిటి?
A దావీదు ; అహీనోయము
B దావీదు; హద్గీతు
C దావీదు; బత్తెబ
D దావీదు ; అబీగయీలు
10. తన తండ్రి తల్లికి మనోవేదన కలిగించిన ఏ స్త్రీలను ఏశావు పెండ్లిచేసుకొనెను?
A ఐగుప్తీయుల
B ఫిలిష్తీయుల
C యెబూసీయుల
D హితీయుల
11: తల్లీతండ్రులను ఏమి చేయవలెను?
A సంతోషపెట్టవలెను
B ఉత్సాహపరచవలెను
C ఉల్లసింపచేయవలెను
D ఆనందింపచేయవలెను
12.తిమోతి తండ్రి తల్లి యొక్క పేరేమిటి?
A బర్సభ,పెర్సిసు
B యాసోను : యునీకే
C హెన్రీను; లోయి
D మ్నాసోను ; ఫీబే
13. యోనా యొక్క తండ్రి తల్లి యొక్క పేరులు ఏమిటి?
A ఇత్తయి; జెబూహు
B తల్మయి : జెరూహూ
C ఆమిత్తయి ; యాషూను
D కెల్మయి ; తెద్దుషు
14: శాస్త్రి యైన ఎజ్రా యొక్క తండ్రి తల్లి ఎవరు?
A శెరాయా; మిక్మషు
B బెనాయా; కదేర్మషు
C జెనాయా; లెమెషు
D మీకాయా : ఎల్మెషు
15. క్రీస్తు వంశావళిలో నున్న పెరెసు యొక్క తండ్రి తల్లి ఎవరు?
A శల్మాను ; రాహాబు
B దావీదు ; బత్తెబ
C బోయజు; రూతు
D యూదా ; తామారు
Result: