Bible Quiz in Telugu Topic wise: 8 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Dog" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. "DOG "అనగా ఏమిటి?
ⓐ కుక్క
ⓑ శునకము
ⓒ భషకము
ⓓ పైవన్నీ
2. కర్రతీసుకొని నా మీదకు వచ్చుచున్నావు, నేను "కుక్కనా"అని ఎవరు దావీదుతో అనెను?
ⓐ షిమ్యా
ⓑ లేమ్హీ
ⓒ గొల్యాతు
ⓓ సౌలు
3. ఈ చచ్చిన "కుక్క "నా యేలినవాడవగు నిన్ను శపించనేల?అని ఎవరి గురించి అబీపై దావీదుతో అనెను
ⓐ హదదు
ⓑ షిమీ
ⓒ నెహానాను
ⓓ అహీతోపెలు
4. చచ్చిన "కుక్క "వంటి వాడనైన నా యెడల నీవు దయ చూపుటకు నేను ఎంతటివాడనని ఎవరు దావీదుతో అనెను?
ⓐ మెఫీబోషెతు
ⓑ యోనాతాను
ⓒ అహీమెలెకు
ⓓ ఆశాహేలు
5. "కుక్కల" విషయములో జాగ్రత్తగా ఉండమని పౌలు ఏ సంఘమును హెచ్చరించెను?
ⓐ ఫిలిప్పీ
ⓑ గలతీ
ⓒ కొరింథీ
ⓓ ఎఫెసీ
6. దేని ప్రాకారము నొద్ద "కుక్కలు"యెజెబెలును తినివేయునని ఏలీయా యెహోవ ద్వారా సెలవిచ్చెను?
ⓐ ఎదోము
ⓑ మోయబు
ⓒ యెజ్రాయేలు
ⓓ ఫిలిష్తీయ
7. మూఢతను కనుపరచు ఎవడు కక్కిన దానిని తిను "కుక్కతో"సమానుడు?
ⓐ పగవాడు
ⓑ దుర్మార్గుడు
ⓒ దుష్టుడు
ⓓ మూర్ఖుడు
8. ఎవరిని "మూగకుక్కలు"అని యెహోవా అనెను?
ⓐ మాంత్రికులను
ⓑ తాంత్రికులను
ⓒ కాపరులను
ⓓ దూషకులను
9. ఎవరు "కుక్కల"వలె మొరుగుచు పట్టణము చుట్టు తిరుగుదురు?
ⓐ పోకిరులు
ⓑ శత్రువులు
ⓒ చెడ్డవారు
ⓓ దుర్మార్గులు
10. "కుక్కలు"వచ్చి దరిద్రుడైన ఎవరి కురుపులు నాకెను?
ⓐ లాజరు
ⓑ బర్తిమయి
ⓒ ఇత్తయి
ⓓ తెర్తియు
11. చచ్చిన దేని కంటే బ్రతికియున్న "కుక్క" మేలు కదా అని ప్రసంగి చెప్పెను?
ⓐ గుర్రము
ⓑ సింహము
ⓒ చిరుతపులి
ⓓ ఒంటె
12. ఎవరిని ఎగతాళి చేయు వారి తండ్రులు అతని మందను కాయు "కుక్కలతో" నుండుటకు తగనివారని అతను అనెను?
ⓐ దావీదు
ⓑ సొలొమోను
ⓒ యోబు
ⓓ హిజ్కియా
13. "కుక్కలు" ఎక్కడ నుండును?
ⓐ చీకటిలో
ⓑ వెలుపట
ⓒ ఊరవతల
ⓓ వీధులలో
14. "కుక్కలు" దేనికి ఆతురపడును?
ⓐ తిండికి
ⓑ కరచుటకు
ⓒ అరచుటకు
ⓓ పారిపోవుటకు
15. దేనిని "కుక్కలకు" పెట్టకుడి అని యేసు చెప్పెను?
ⓐ మంచిది
ⓑ రుచియైనది
ⓒ ఉప్పు వేసినది
ⓓ పరిశుద్ధమైనది
Result: