1. ఇశ్రాయేలీయుల సంతతి వారు నీటికాలువల యొద్ద నాటబడిన ఏ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు ఎదుగుదురని యెహోవా అనెను?
2 . నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవచెట్టు వలెనున్నానని ఎవరు అనెను?
3. యెహోవా చూపిన దర్శనములో ఎవరికి బాదము చెట్టు చువ్వ కనబడెను?
4. ఎవరు సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు?
5. ఎవరు లెబానోను పర్వతమునకు వచ్చి దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను?
6. యెహోవా జనుల యెదుట ఎక్కడి చెట్లన్నియు చప్పట్లు కొట్టును?
7. ఇశ్రాయేలు ఎలా వ్యాపించిన ద్రాక్షా చెట్టుతో సమానము?
8. ఏ నదుల యొద్ద కూర్చున్న యూదులు వాటి మధ్యన నున్న నిరవంజి చెట్లుకు సితారాలను తగిలించిరి?
9 . ఎక్కడ యెహోవా దేవదారు తుమ్మగొంజి తైలవృక్షములను నాటించెదనని యెహోవా అనెను?
10 . అరణ్యములో బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన ప్రవక్త ఎవరు?
11. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఎక్కడ ఉన్న ఆరుహా వృక్షము వలె ఉండును?
12. తామర చెట్లు క్రింద పండుకొను జంతువు ఏది?
13. అంత్యదినములలో ఏమి లేకుండా ప్రతివాడును ద్రాక్షా అంజూరపు చెట్టుల క్రిందను కూర్చుండును?
14. ఇశ్రాయేలుకు యెహోవా చెట్టుకు ఏమి యుండునట్లు యుండును?
15. యేసుక్రీస్తును చూచుటకు జక్కయ్య ఏ చెట్టు ఎక్కెను?
Result: