Bible Quiz in Telugu Topic wise: 83 || తెలుగు బైబుల్ క్విజ్ ("World Wind Day" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "WIND" అనగా ఏమిటి?
ⓐ గాలి ; వాయువు
ⓑ వీవనము
ⓒ పవనము
ⓓ పైవన్నియు
2. దేవుడు తన యొక్క ఎక్కడ నుండి గాలిని రావించును?
ⓐ గదులలో
ⓑ ఆవాసములో
ⓒ ధనాగారములలో
ⓓ పురములలో
3. దేవుని యొక్క ఏమి సుడిగాలి వలె నున్నవి?
ⓐ ఖడ్గములు
ⓑ రధములు
ⓒ గుర్రములు
ⓓ మేఘములు
4. గాలికి ఏమి ఉండవలెనని యెహోవా నియమించెను?
ⓐ ఇంత బరువు
ⓑ ఇంతదూరము
ⓒ ఇంతకొలత
ⓓ ఇంత పొడవు
5. ఎవరు విసరి, వెళ్లి మరలి రాని గాలి వలె నున్నారని యెహోవా జ్ఞాపకము చేసుకొనెను?
ⓐ యాజకులు
ⓑ రాజులు
ⓒ అన్యజనులు
ⓓ ఇశ్రాయేలీయులు
6. ఎవరిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును?
ⓐ తన స్నేహితులను
ⓑ తన పొరుగువారిని
ⓒ తన ఇంటివారిని
ⓓ తన బంధువులను
7. మేము గాలిని కన్నట్టు ఉంటిమని ఏ దేశపు జనులు పాడుదురు?
ⓐ షోమ్రోను
ⓑ యూదా
ⓒ అష్టూరు
ⓓ ఐగుప్తు
8. దేని యందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి దేవుని జనుల కుమారి తట్టు విసరు చున్నది?
ⓐ అరణ్యము
ⓑ మైదానము
ⓒ ఎడారి
ⓓ పర్వతము
9. తూర్పుగాలి సముద్రము మధ్య నిన్ను బద్దలు చేయునని, యెహోవా దేని గురించి అంగలార్పు వచనమెత్తమనెను?
ⓐ సిరియపట్టణము
ⓑ తూరుపట్టణము
ⓒ గాజాపట్టణము
ⓓ తిమ్నాతుపట్టణము
10. యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలు దేరి జనుల ఆహారము నిమిత్తము సముద్రము నుండి ఏమి రప్పించెను?
ⓐ మత్స్యములు
ⓑ జలచరములు
ⓒ పూరేళ్ళు
ⓓ చిన్నచేపలు
11. కొండమీద పొట్టు ఎగిరిపోవునట్లు ఎవరు తరుమబడుదురని యెహోవా సెలవిచ్చెను?
ⓐ తూరు
ⓑ అష్షూరు
ⓒ మోయాబు
ⓓ దమస్కు
12. ఎవరు గాలి మాటలు చెప్పుదురని ఇశ్రాయేలు యూదా వంశస్థులు చెప్పుచున్నారు?
ⓐ ప్రవక్తలు
ⓑ యాజకులు
ⓒ దీర్ఘదర్శులు
ⓓ దైవజనులు
13. తమ యొక్క దేనిని దేవతగా భావించుకొను జనులు గాలి కొట్టుకొనిపోవునట్లుగా పోవుచు అపరాధులగుదురు?
ⓐ జ్ఞానమును
ⓑ బలమును
ⓒ తెలివిని
ⓓ వివేచనను
14. జనుల కుమార్తె తట్టు విసిరిన వడగాలి కంటే ఏమైన గాలి నా మీద కొట్టుచున్నదని యెహోవా అనెను?
ⓐ అధికమైన
ⓑ ఎక్కువయైన
ⓒ మిక్కటమైన
ⓓ బలమైన
15. ఎవరు గాలికి మరుగైన చోటు వలెను ఉండును?
ⓐ భూమి
ⓑ కొండ
ⓒ మేఘము
ⓓ మనుష్యుడు
Result: