Bible Quiz in Telugu Topic wise: 85 || తెలుగు బైబుల్ క్విజ్ ("అంగవైకల్యం" అనే అంశముపై బైబిల్ క్విజ్ )

① ఏమి వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు "గ్రుడ్డివాడుగా"పుట్టెనని యేసు "పుట్టుగ్రుడ్డి" వాని గురించి శిష్యులతో చెప్పెను?
Ⓐ దేవుని క్రియలు
Ⓑ దేవుని పనులు
Ⓒ దేవుని కార్యములు
Ⓓ దేవుని అద్భుతములు
② ఏమి పట్టిన "మూగవాని"కొందరు యేసు యొద్దకు తీసుకొని ఆయన వాని స్వస్థపరచెను?
Ⓐ పిచ్చి
Ⓑ జ్వరము
Ⓒ దెయ్యము
Ⓓ భూతము
③ ఎక్కడివారు ఒక "గ్రుడ్డివాని"యేసు నొద్దకు తీసుకొని రాగా ఆయన అతని స్వస్థపరచెను?
Ⓐ బేత్పెగే
Ⓑ బేత్సయిద
Ⓒ కపెర్నహూము
Ⓓ బేతనియ
④ యేసు ఏ సముద్రము నొద్దకు వచ్చినపుడు అక్కడి వారు "చెవుడుగలనత్తి"వాని ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వాని స్వస్థపరచెను?
Ⓐ అరాబ
Ⓑ మహా
Ⓒ ఎర్ర
Ⓓ గలిలయ
⑤ యేసు ఎక్కడనుండి వెళ్ళుచుండగా ఇద్దరు "గ్రుడ్డివారు "కరుణింపుమని కేకలు వేయగా ఆయన వారిని స్వస్థపరచెను?
Ⓐ ఎమ్మాయి
Ⓑ బేతనియ
Ⓒ యెరికొ
Ⓓ సిరియ
⑥ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున "పుట్టినది మొదలు కుంటివాడైన"వ్యక్తిని స్వస్థపరచినదెవరు?
Ⓐ పౌలు; సీల
Ⓑ పేతురు; యోహాను
Ⓒ ఫిలిప్పు; యాకోబు
Ⓓ అంద్రెయ; యూదా
⑦ "రెండు కాళ్ళుకుంటి"వైన ఎవరిని దావీదు పోషించెను?
Ⓐ హూషైను
Ⓑ అబ్నేరును
Ⓒ మెఫీబోశెతెను
Ⓓ యోనాతానును
⑧ దేవుడు వచ్చి రక్షించుదినమున "కుంటివాడు" దేనివలె గంతులు వేయును?
Ⓐ జింక
Ⓑ లేడి
Ⓒ ఒంటె
Ⓓ దుప్పి
⑨ యేసు నొద్దకు జనసమూహము ఎవరిని తీసుకొని రాగా ఆయన వారందరిని స్వస్థపరచెను?
Ⓐ కుంటివారు, గ్రుడ్డివారిని
Ⓑ ముగవారిని
Ⓒ అంగహీనులను
Ⓓ పైవారందరిని
①⓪. ప్రతిదండన చేయుటకై దేవుడు వచ్చుచున్నప్పుడు "మూగవాని"నాలుక ఏమిచేయును?
Ⓐ పాడును
Ⓑ మాట్లాడును
Ⓒ సడలును
Ⓓ విప్పబడును
①① ఎక్కడ యున్న "ఊచచెయ్యి"గలవానిని యేసు స్వస్థపరచెను?
Ⓐ త్రోవప్రక్కన
Ⓑ పట్టణపువీధిలో
Ⓒ సమాజమందిరములో
Ⓓ సంతబజారులో
①② యెహోవా దినమున "చెవిటి వారు"ఏమి విందురు?
Ⓐ ప్రమాణవాక్యములను
Ⓑ గ్రంధవాక్యములను
Ⓒ ఉపదేశములను
Ⓓ శాసనఅజ్జలను
①③ "చెవిటి" వారిని ఏమి చేయకూడదని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ నెట్టకూడదని
Ⓑ హింసించకూడదని
Ⓒ తిట్టకూడదని
Ⓓ పరిహసించకూడదని
①④ "గ్రుడ్డివాని "యెదుట ఏమి వేయకూడదని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ ముళ్ళు
Ⓑ రాళ్లు
Ⓒ కంచెలు
Ⓓ అడ్డము
①⑤ "గ్రుడ్డివాని "త్రోవ తప్పించువాడు ఎవరని యెహోవా చెప్పెను?
Ⓐ శాపగ్రస్తుడు
Ⓑ నిష్ ప్రయోజకుడు
Ⓒ మూర్ఖుడు
Ⓓ పనికిమాలినవాడు
Result: