Bible Quiz in Telugu Topic wise: 86 || తెలుగు బైబుల్ క్విజ్ ("అంత్యదినములు-కలవరిగడియ" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. ఇది ఏ గడియ?
ⓐ ప్రారంభగడియ
ⓑ జరుగుతున్న గడియ
ⓒ మధ్య గడియ
ⓓ కడవరిగడియ
2. కడవరి గడియలో ఎవరు బయలుదేరియున్నారు?
ⓐ క్రీస్తు విరోధులు
ⓑ ద్రోహులు
ⓒ దొంగలు
ⓓ దూషకులు
3. తండ్రియైన దేవుని కుమారుడైన క్రీస్తును ఏమి చేయనివాడు క్రీస్తు విరోధి?
ⓐ కనని
ⓑ చూడని
ⓒ నమ్మని
ⓓ ఒప్పుకొనని
4. అంత్యదినములలో ఎటువంటి కాలములు వచ్చును?
ⓐ భయంకరమైన
ⓑ అపాయకరమైన
ⓒ దాగుకొనే
ⓓ వణికించే
5. అన్నిటి యొక్క అంతము ఎలా యున్నది?
ⓐ దగ్గరయై
ⓑ దూరముయై
ⓒ సమీపమై
ⓓ త్వరితమై
6. అంత్యకాలములో ఏమి సంభవించును?
ⓐ గొప్పభూకంపములు
ⓑ తెగుళ్ళు - కరువులు
ⓒ యుద్ధములు
ⓓ పైవన్నియు
7. అంత్యదినముల ముందు ఆకాశము నుండి ఎటువంటి గొప్ప సూచనలు పుట్టును?
ⓐ మహాభయోత్పాతములు
ⓑ మహా వణుకు పుట్టించేవి
ⓒ మహా భీతికరమైనవి
ⓓ మహా దిగులుకరమైనవి
8. అంత్యదినములలో ఎవరు వచ్చి పలువురిని మోసపరచును?
ⓐ దొంగలు
ⓑ దోచుకొనువారు
ⓒ అబధ్ధప్రవక్తలు
ⓓ దూషకులు
9. అంత్యదినములలో ఏమి కలుగును?
ⓐ మహాభయము
ⓑ మహాదుఃఖము
ⓒ మహాభీతి
ⓓ మహాశ్రమ
10. అంత్యదినములలో జరుగుతున్నవన్నీ వేటికి ప్రారంభము?
ⓐ వేదనలకు
ⓑ సిద్ధపాటుకు
ⓒ క్షమాపణకు
ⓓ నిరీక్షణకు
11. అంత్యదినములలో నాశనకరమైన ఏది పరిశుద్ధస్థలములో నిలుచుట మనము చూతుము?
ⓐ విగ్రహము
ⓑ బొమ్మ
ⓒ హేయవస్తువు
ⓓ మాయమూర్తులు
12. అంత్యదినములలో ఏమి విస్తరించును?
ⓐ అవిధేయత
ⓑ కపటము
ⓒ ద్రోహము
ⓓ అక్రమము
13. అంత్యదినములలో ఎవరు వచ్చి ఏమి చేసి ఏర్పర్చబడిన వారిని సహితము మోసపరచును?
ⓐ అబద్ధపు క్రీస్తులు
ⓑ అబద్ధపు ప్రవక్తలు
ⓒ సూచకక్రియలు- మహత్కార్యములు
ⓓ పైవన్నియు
14. అంత్యదినములలో భూమి మీద సముద్ర ఘోష వలన కలవరపడిన ఎవరికి శ్రమ కలుగును?
ⓐ రాజులకు
ⓑ అధికారులకు
ⓒ జనములకు
ⓓ పాలకులకు
15. అంత్యదినములలో మనము దేని చేత మన ప్రాణములను దక్కించుకొందుము?
ⓐ ధనము
ⓑ బలము
ⓒ ఖడ్గము
ⓓ ఓర్పు
Result: