1. కన్నులకు "అందమైన"దిగా కనబడిన వృక్షము యొక్క ఫలము తిని తన భర్తకు ఇచ్చిన స్త్రీ ఎవరు?
2. చూపునకు "అందమైన"వియు బలిసినవియునైన ఏమి యేటిలో నుండి పైకి వచ్చుట కలలో ఫరో చూచెను?
3. యెహోవా ఊపిరి విడువగా వేటికి "అందము"వచ్చును?
4. "అందమైన"రూపమును కలిగిన స్త్రీ ఎవరు?
5. సర్వశరీరుల "అందమంతయు "దేని వలె నున్నది?
6. ఎవరి కంటికి "అందమైన"వస్తువులనన్నిటిని యెహోవా నాశనము చేసియున్నాడు?
7. నాకు పెండ్లిచేయబడిన ఎవరు "అందము"గల యౌవనులను మోహించెనని యెహోవా అనెను?
8. ఎక్కడి దేవదారు వృక్షము యొక్క వేరు విస్తారజలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై "అందమైన"దాయెను?
9. "అందమైన"కన్యకలను ఏ రాజు కొరకు వెదకనగును అని అతని పరిచారకులు అనిరి?
10. సర్వశరీరుల "అందమంతయు" గడ్డిపువ్వువలె ఉన్నది అని ఎవరు అనెను?
11. ఇది "అందమైన" రాళ్ళతోను అర్పితములతోను శృంగారింపబడియున్నదని దేని గురించి కొందరు మాటలాడుచుండగా యేసు వినెను?
12. ఏది తలకు "అందమైన" మాలిక కట్టు అగును?
13. గర్విష్టురాండ్రైన సీయోను కుమార్తెల యొక్క "అందమునకు" ప్రతిగా వాతయును యుండునని ఎవరు ప్రవచించెను?
14. పాదరక్షలతో "అందముగా"నడుచుచున్నదెవరు?
15. దేని య౦త "అందము "గలదని షూలమ్మితీ గురించి ప్రియుడైన క్రీస్తు అనెను?
Result: