Bible Quiz in Telugu Topic wise: 90 || తెలుగు బైబుల్ క్విజ్ (అంధకారము అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. అంధకారము" బెదరించును గాక అని ఎవరు తాను పుట్టిన దినమును శపించుకొనెను?
A దావీదు
B షెమాయా
C హిజ్కియా
D యోబు
2 "అంధకారము" నన్ను ఏమి చేయునని దావీదు అనుకొనెను?
A చాటు
B దాచును
C మరుగు
D క్రమ్మును
3.అంధకార సంబంధమైన దేని నుండి ప్రభువు విడుదల చేయును?
A క్రియలు
B అధికారము
C బంధకము
D కట్ల
4 . "అంధకారము"లో నుండి ఏమి ప్రకాశించునని దేవుడు పలికెను?
A వెలుగు
B కాంతి
C వితానము
D కిరణము
5."అంధకార స్థలములలో నుంచబడిన వేటిని యెహోవా ఇచ్చెదననెను?
A ధనమును
B వెండిబంగారములను
C విలువైన రత్నములను
D నిధులను
6."అంధకారము"లో దిగు వరకు యెహోవా ఎవరిని తరుమును?
A శత్రువులను
B వైరులను
C అన్యులను
D మూర్ఖులను
7ప్ర. ఎవరి మార్గము "గాఢాంధకారమయము"?
A దొంగల
B భక్తిహీనుల
C దుర్మార్గుల
D బుద్ధిహీనుల
8 ప్ర. ఏమిలేని జనులు "అంధకారములో" ఇటు అటు తిరుగులాడుదురు?
A జ్ఞానము
B వివేచన
C తెలివి
D గ్రహింపు
9 ప్ర. ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము గాని "అంధకారము" లోనే నడచుచున్నామని ఎవరు అనెను?
A యిర్మీయా
B యెషయా
C దావీదు
D జెకర్యా
10 . "అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన వేటిని ధరించుకొనవలెను?
A యుద్దోపకరణములు
B శిరస్త్రాణములు
C ఆభరణములు
D భూషణములు
11 . యెహోవా ఎవరిని "మరణాంధకారము" లో నుండి రప్పించెను?
A రేకాబీయులను
B ఇశ్రాయేలీయులను
C యూదా వారిని
D హోబాబీయులను
12 . యెహోవా దినము "అంధకారము" అని ఎవరు అనెను?
A యెహెజ్కేలు
B యోవేలు
C ఆమోసు
D ఆసాపు
13ప్ర. దేనివలె "అంధకారమును" యెహోవా తన చుట్టు వ్యాపింపజేసెను?
A మేఘము
B వర్షము
C వాయువు
D గుడారము
14. దేవుని యొక్క దేనిని కామాతురత్వమునకు దుర్వినియోగపరచు వారి కొరకు "గాఢాంధకారము"నిరంతరము భద్రము చేయబడియున్నది?
A మహిమను
B కీర్తిని
C కృపను
D ప్రేమను
15 . "గాఢాంధకారమునందు" నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడని, ఎవరు ప్రకటన చేసెను?
A యోహాను
B మలాకీ
C సొలొమోను
D జెకర్యా
Result: