1. పరిశుద్ధగ్రంధములో ఎన్ని "అక్షరములు" కలవు?
2. పరిశుద్ధగ్రంధములో ఎక్కువ "అక్షరములు"గల పేరేమిటి?
3. మహేరు షాలాల్ హాష్ బజ్ అను మాటలు సామాన్య "అక్షరములతో" దేని మీద వ్రాయుమని యెహోవా యెషయాతో అనెను?
4. పరిశుద్ధగ్రంధములో ఒకే "ఆక్షరము" గల పేరేమిటి?
5. దేనిని గూర్చిన ప్రకటనను ఒకడు "అక్షరములు"తెలిసిన వానిని చదువుమని వానికి అప్పగించును?
6. "అక్షరములు" తెలియని వానిని ఎలా అరీయేలు గురించి ప్రకటనను చదువమనగా వాడు నాకు తెలియదనును?
7. ఒక "అక్షరముతో" గల దేశము ఏమిటి?
8. పౌలు తన స్వహస్తముతో పెద్ద "అక్షరములతో"ఏ సంఘమునకు పత్రిక వ్రాసెను?
9. "అక్షరమునకు" కాదు ఆత్మకే పరిచారకులమగునట్లు దేవుడు మాకు ఏమి కలిగించియున్నాడని పౌలు అనెను?
10. ఏమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన "అక్షరములకు" సంబంధించినదైనను మహిమ గలది?
11. ఏమి హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగున గాని "అక్షరము"వలన కాదు?
12."అక్షరము" చంపును గాని క్రొత్త నిబంధన అనే ఏమి జీవింపజేయును?
13. పౌలు "అక్షరము"అని చెపుతున్నది ఏమిటి?
14. దేని మీద నన్ను "నామాక్షరముగా" ఉంచుమని షూలమ్మితీ క్రీస్తుతో అనెను?
15. తన ప్రియుని మీద ఆనుకొని ఎక్కడ నుండి వచ్చుచున్న షూలమ్మితీ ఆయన భుజము మీద "నామాక్షరముగా" నుంచమని అనెను?
Result: