Telugu Bible Quiz Topic wise: 505 || తెలుగు బైబుల్ క్విజ్ ("పరిచారము" అనే అంశము పై క్విజ్ )

① మోషే యొక్క "పరిచారకుడు"ఎవరు?
Ⓐ యోహోషువ
Ⓑ హూరు
Ⓒ అహరోను
Ⓓ కాలేబు
② ఎవరు "పరిచారము "నిమిత్తము పౌలుకు ప్రయోజనకరమైనవాడు?
Ⓐ తిమోతి
Ⓑ మార్కు
Ⓒ లుకా
Ⓓ తీతు
③ మీరు కోరుకొన్న రాజు మీ ధాన్యము ద్రాక్షపండ్లలోను పదియవ భాగము తీసి తన "పరిచార"జనమునకు ఇచ్చునని ఎవరు ఇశ్రాయేలీయులతో అనెను?
Ⓐ గిద్యోను
Ⓑ సమూయేలు
Ⓒ ఎలియాజరు
Ⓓ సమ్సోను
④ ఫీబే ఎక్కడ ఉన్న సంఘ "పరిచారకురాలు"?
Ⓐ కెంక్రేయ
Ⓑ అకయ
Ⓒ బేరాయ
Ⓓ సిరియ
⑤ నా కుమారులారా, తనకు "పరిచారకులై"యుండి ధూపము వేయుచుండుటకు యెహోవా మిమ్మును ఏర్పర్చుకొనెనని ఎవరు లేవీయులతో అనెను?
Ⓐ ఉజ్జీయా
Ⓑ యెషీయ
Ⓒ హిజ్కియా
Ⓓ అహీయా
⑥ అందమైన కన్యకలను ఏ రాజు కొరకు వెదకనగునని అతని "పరిచారకులు"అతనితో అనిరి?
Ⓐ అర్తహషస్త
Ⓑ అహష్వేరోషు
Ⓒ దర్యావేషు
Ⓓ కోరెషు
⑦ యేసు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన సంగతి "పరిచారకులకే"తెలిసినది గాని ఎవరికి తెలియకపోయెను?
Ⓐ పెండ్లికుమారునికి
Ⓑ పెండ్లి పెద్దలకు
Ⓒ బంధువులకు
Ⓓ విందుప్రధానికి
⑧ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునందు మంచి "పరిచారకుడవై" యుందువని పౌలు ఎవరితో అనెను?
Ⓐ తిమోతితో
Ⓑ ఏపాప్రాతో
Ⓓ అపొల్లోతో
Ⓓ యాసోనుతో
⑨ వేటిని యెహోవా తనకు "పరిచారకులుగాను "చేసికొనెను?
Ⓐ మేఘములను
Ⓑ పర్వతములను
Ⓒ అగ్నిజ్వాలలను
Ⓓ వడగండ్లను
①⓪. మనకు ఏమి కలుగుటకు అధికారులు దేవుని"పరిచారకులు?
Ⓐ మంచి
Ⓑ మేలు
Ⓒ చెడు
Ⓓ హీతము
①① దూతలు ఏమి యను స్వాస్థ్యము పొందబోవువారికి "పరిచారము"చేయుటకై పంపబడిన ఆత్మలని పౌలు అనెను?
Ⓐ నిరీక్షణ
Ⓑ నీతి
Ⓒ సత్యము
Ⓓ రక్షణ
①② ఎవరు దేవుని కనికరమును గూర్చి ఆయనను మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగల వారికి "పరిచారకుడాయెను"?
Ⓐ అన్యజనులు
Ⓑ ఇజ్రాయేలీయుల
Ⓒ పరదేశులు
Ⓓ సేవకులు
①③ ఎక్కడ ఉన్న "పరిచారకులకు "క్రీస్తుయేసు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి పత్రిక వ్రాసెను?
Ⓐ ఎఫెసీ
Ⓑ గలతీ
Ⓒ ఫిలిప్పీ
Ⓓ కొరింథీ
①④ అపొల్లో ఎవడు? పౌలు ఎవడు?" పరిచారకులే" కదా అని పౌలు ఏ సంఘముతో అనెను?
Ⓐ కొలొస్సయి
Ⓑ కొరింథీ
Ⓒ ఫిలిప్పీ
Ⓓ ఎఫెసీ
15 మనుష్యకుమారుడు "పరిచారము" చేయుటకును అనేకులకు ప్రతిగా ఎలా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనని యేసు అనెను?
Ⓐ పునరుత్థానశక్తిగా
Ⓑ జీవపు ఊటగా
Ⓒ చెరవిముక్తిగా
Ⓓ విమోచనక్రయధనముగా
Result: