Telugu Bible Quiz Topic wise: 506 || తెలుగు బైబుల్ క్విజ్ ("పరీక్ష" అనే అంశము పై క్విజ్ )

1. Examine అనగా అర్ధము ఏమిటి?
Ⓐ పరీక్షించుట
Ⓑ పరిశోధించుట
Ⓒ పరిశీలించుట
Ⓓ పైవన్నియు
2. దేవుడు ఎవరిని "పరిశోధించెను"?
Ⓐ ఆదామును
Ⓑ నోవహును
Ⓒ అబ్రాహామును
Ⓓ హనోకును
3. యెహోవా ఎవరిని "పరిశీలించును"?
Ⓐ బలవంతులను
Ⓑ నీతిమంతులను
Ⓒ యధార్థవంతులను
Ⓓ మంచివారిని
4. హృదయములను అంతరంగములను "పరిశీలించు" నీతిగల దేవా అని యెహోవాతో ఎవరు అనెను?
Ⓐ దావీదు
Ⓑ హిజ్కియా
Ⓒ సొలొమోను
Ⓓ ఆసాపు
5. శాకాధాన్యములను నీళ్లును ఇచ్చి ఎప్పటి వరకు మమ్మును "పరీక్షింపుమని"ఎవరు నపుంసకుల యధిపతితో అనెను?
Ⓐ హనన్యా
Ⓑ దానియేలు
Ⓒ నెహెమ్యా
Ⓓ జేకార్య
6. అగ్నిలో నుండి బయటకు వచ్చిన షద్రకు మేషాకు అబేద్నగో అనువారిని ఎవరు "పరీక్షించిరి"?
Ⓐ అధిపతులును: సేనాధిపతులును
Ⓑ సంస్థానాధిపతులును
Ⓒ ప్రధానమంత్రులును
Ⓓ పై వారందరు
7. అన్యదేవతల తట్టు చేతులు చాపినయెడల ఏమి ఎరిగిన దేవుడు ఆ సంగతిని "పరిశోధింపక"మానునా? అని కోరహుకుమారులు అనెను?
Ⓐ భూలోకమును
Ⓑ దాగుచోటులను
Ⓒ హృదయరహస్యములను
Ⓓ అంతరంగములను
8. నన్ను "పరీక్షించి"నా యొక్క వేటిని తెలిసికొనుమని దావీదు దేవునితో అనెను?
Ⓐ యోచనలను
Ⓑ తలంపులను
Ⓒ అంతరమును
Ⓓ ఆలోచనలను
9 .వేటిని గూర్చి "విచారించుడి"అని యెహోవా సెలవిచ్చుచున్నాడు?
Ⓐ రాజమార్గములను
Ⓑ పురాతనమార్గములను
Ⓒ రహస్యమార్గములను
Ⓓ ఉన్నతమార్గములను
10. ప్రతి మనుష్యుడు తన్నుతాను "పరీక్షించు" కొనవలెనని పౌలు ఏ సంఘముకు చెప్పెను?
Ⓐ ఎఫెసీ
Ⓑ గలతీ
Ⓒ కొరింథీ
Ⓓ ఫిలిప్పీ
11. ఏది "పరీక్షను"కలుగజేయును?
Ⓐ శ్రమ
Ⓑ బాధ
Ⓒ నింద
Ⓓ ఓర్పు
12. అమూల్యమైన విశ్వాసము శోధనల చేత "పరీక్షకు"నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమి కలుగుటకు కారణమగును?
Ⓐ మెప్పును
Ⓑ మహిమయు
Ⓒ ఘనతయు
Ⓒ పైవన్నీ
13. ప్రతివాడును తాను చేయుపనిని "పరీక్షించి"చూచుకొనవలెనని పౌలు ఏ సంఘముకు వ్రాసెను?
Ⓐ గలతీ
Ⓑ ఫిలిప్పీ
Ⓒ కొరింథీ
Ⓓ ఎఫెసీ
14. "పరీక్ష"ఏమి కలుగజేయును?
Ⓐ సహనము
Ⓑ నిరీక్షణ
Ⓒ న్యాయము
Ⓓ ధర్మము
15. ఎవరు రక్షణను గూర్చి "పరిశీలించుచు" క్రీస్తు విషయమైన శ్రమలు,మహిమల గూర్చి సాక్ష్యమిచ్చి క్రీస్తు ఆత్మ సూచించే కాలములను "విచారించి" "పరిశోధించిరి"?
Ⓐ జ్ఞానులు
Ⓑ రాజులు
Ⓒ ఘనులు
Ⓓ ప్రవక్తలు
Result: