1Q. సమస్తమును పరీక్షించి దేనిని చేపట్టవలెను?
2Q. దేవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి వేటిని తెలుకోమని దావీదు పలికెను.?
3Q. విశ్వాసమునకు కలుగు పరీక్ష దేనిని పుట్టించును?
4Q. భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి ఎన్ని దినముల వరకు మమ్మును పరీక్షింపుము అని దానియేలు అనెను?
5Q. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష దేనిని కలుగజేయునని యెరిగి ఉండవలెను?
6Q. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, ఎవరివలె నడుచుకొనవలెను?
7Q. మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులై ఉంటె వారు ఎవరుగా ఉండవచ్చు?
8Q. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే వేటిని పరీక్షించువాడు?
9Q. అమూల్యమైన మన విశ్వాసము దేనిచేత పరీక్షకు నిలిచినదై ఉండవలెను?
10 Q. నశించిపోవు సువర్ణము ఏ పరీక్షవలన శుద్ధపరచబడుచున్నది?
11. ఏది "పరీక్షను"కలుగజేయును?
12. అమూల్యమైన విశ్వాసము శోధనల చేత "పరీక్షకు"నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమి కలుగుటకు కారణమగును?
13. ప్రతివాడును తాను చేయుపనిని "పరీక్షించి"చూచుకొనవలెనని పౌలు ఏ సంఘముకు వ్రాసెను?
14. "పరీక్ష"ఏమి కలుగజేయును?
15. ఎవరు రక్షణను గూర్చి "పరిశీలించుచు" క్రీస్తు విషయమైన శ్రమలు,మహిమల గూర్చి సాక్ష్యమిచ్చి క్రీస్తు ఆత్మ సూచించే కాలములను "విచారించి" "పరిశోధించిరి"?
Result: