① 'Run' అనగ అర్ధము ఏమిటి?
② "పరుగు"మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవని ఎవరు అనెను?
③ ఎవరు యాకోబును ఎదుర్కొన "పరుగెత్తి" అతనిని కౌగలించుకొనెను?
④ ఏమి గలవారు "పరుగులో"గెలువరని ప్రసంగి అనెను?
⑤ ముగ్గురు మనుష్యులను ఎదుర్కొనుటకు "పరుగెత్తిన"దెవరు?
⑥ అబ్రాహాము యొక్క దాసుని మాటలు ఎవరు "పరుగెత్తి"కొనిపోయి తన తల్లి యింటివారికి తెలిపెను?
⑦ రిబ్కా సహోదరుడైన ఎవరు అబ్రాహాము దాసుని యొద్దకు "పరుగెత్తి"కొని పోయెను?
⑧ తన యెదుట "పరుగెత్తుటకై"యేబది మంది బంటులను ఏర్పర్చుకొనినదెవరు?
⑨ ఒంటరిగా "పరుగెత్తి"కొని వచ్చుచున్న వాని చూచి ఎవరికి కావలివాడు అరచి తెలియజేసెను?
①⓪. సామానులో దాగియున్న ఎవరిని కొందరు "పరుగెత్తి"కొనిపోయి తోడుకొని వచ్చిరి?
①① దావీదు గొల్యాతును ఎదుర్కొనుటకు ఎవరి తట్టు త్వరగా "పరుగెత్తి"కొనిపోయెను?
①② "పరుగెత్తుచు" చదువ వీలగునట్లు దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుమని యెహోవా ఎవరికి చెప్పెను?
①③ యెహోవా కొరకు ఎదురుచూచువారు ఎలా"పరుగెత్తుదురు"?
①④ దేని వీధులలో అటు ఇటు "పరుగెత్తుచు" చూచి తెలుసుకొనుమని యెహోవా అనెను?
①⑤ నీవు ఎవరితో "పరుగెత్తగా"వారు నిన్ను ఆలయగొట్టిరి కదా?అని యెహోవా యిర్మీయాతో అనెను?
Result: