1. ఎవరు తన "పరుపులను"సిద్ధపరచుకొనును?
2. నా "పరుపు"మీద బోళము ఆగరుకారపు చెక్క చల్లియుంచితినని ఏమివేసుకొనిన కపటము గల స్త్రీ చెప్పెను?
3. ఎవరెవరు అరణ్యములో నున్న దావీదు నొద్దకు "పరుపులను" తీసుకొని వచ్చిరి?
4. ఉన్నతమైన మహాపర్వతము మీద ఎవరు తమ "పరుపులను" వేసికొనిరని యెహోవా అనెను?
5. నా "పరుపు"నాకు ఉపశాంతి ఇచ్చునని ఎవరు అనుకొనెను?
6. ఏ కోటలో నేలమీద వెండి బంగారుమయమైన జలతారు గల "పరుపులు"ఉండెను?
7. తమ "పరుపు" వెడల్పు చేసుకొని తమ పక్షపువారితో జనులు ఏమి చేసికొనిరి?
8. వేటికి పూటబడువారితో చేరిన యెడల, వారి నిమిత్తము వారితో చేరిన వాడు తన పరుపును"పోగొట్టుకొనును?
9. రక్తస్రావము గల స్త్రీ కూర్చున్న "పరుపును" ముట్టినవాడు ఎప్పటి వరకు అపవిత్రుడై యుండును?
10. ప్రతి రాత్రియు కన్నీరు విడచుచు నా "పరుపును"తేలజేయుచున్నానని ఎవరు అనెను?
11. సొలొమోనుకు చేయబడిన మెత్తలు(పరుపులు)దేనితో చేయబడెను?
12. ఎవరు వచ్చుచుండగా అతని నీడ పడవలెనని జనులు రోగులను మంచము "పరుపుల"మీద ఉంచిరి?
13. ఏ కోనేటి దగ్గర నున్న వ్యాధిగ్రస్తునితో యేసు, నీ "పరుపు"ఎత్తుకొని నడువమని చెప్పెను?
14. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు,నీ "పరుపును" నీవే పరచుకొనుమని పేతురు ఎవరితో చెప్పెను?
15. పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ "పరుపెత్తుకొని"నడువమని చెప్పుట సులభమా? అని యేసు ఎవరిని అడిగెను?
Result: