1 . "Songs" అనగా అర్ధము ఏమిటి?
2 . స్తుతి "పాటలు"పాడుటకు ఎవరి సంబంధులు ఏర్పర్చబడెను?
3 . దైవజనుడైన ఎవరి ఆజ్ఞను బట్టి స్తుతి "పాటలు"పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి?
4 . ఎవరు నా మీద "పాటలు"పాడుదురని కీర్తనాకారుడు అనెను?
5 . నేను పాడిన "పాట"రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందునని ఎవరు అనెను?
6. ఎవరు చేసిన తిరుగుబాటును బట్టి వారి కన్యకలకు పెండ్లి "పాటలు"లేకపోయెను?
7. జనములు "పాటలు"పాడుచు వాద్యములు వాయించుచు ఏమి నీ యందే యున్నవని దేవునితో అనెదరు?
8. యాత్రికుడనైన నేను నా బసలో "పాటలు" పాడుటకు నీయొక్క ఏమి హేతువులాయెనని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
9 . యెహోవా యొక్క దేని చేత భాధ అనుభవించిన నరుడు తన వారు దినమెల్ల పాడునట్టి "పాటలకు"ఆస్పదుడనైతిననెను?
10 . నా మీదికి లేచువారి "పాటలకు"ఆస్పదమైన నన్ను బట్టి వారికి ప్రతికారము చేయుమని ఎవరు అనెను?
11. ఇశ్రాయేలీయుల పాటల యొక్క ఏమి నా యొద్ద నుండి తొలగనియ్యుడి అని యెహోవా అనెను?
12. ఇశ్రాయేలు యొక్క ఎవరు స్వరమండలముతో కలిసి పిచ్చి"పాటలు"పాడుదురని యెహోవా అనెను?
13. ఇశ్రాయేలీయులు మందిరములో పాడు "పాటలు"యెహోవా దినమున ఏమగునని ఆయన అనెను?
14. ఇశ్రాయేలీయుల పండుగ దినములను ఎలా మార్చి వారి "పాటలను"ప్రలాపములుగా మార్చుదునని యెహోవా అనెను?
15 . సీయోను నివాసులను ఎలా యుండి "పాటలు"పాడమని యెహోవా అనెను?
Result: