1. తన యజమానురాలి యొద్ద నుండి పారిపోయినది ఎవరు?
2. లోతు ఎక్కడికి పారిపోయెను?
3. తన అన్న నిమిత్తము పారిపోయినది ఎవరు?
4. పాపమునకు దూరముగా పారిపోయినది ఎవరు?
5. ఫరో యెదుట నుండి పారిపోయినది ఎవరు?
6. తెలియక పొరపాటున ఒకనిని చంపిన వాడు ఎక్కడికి పారిపోవలెను?
7. యెహోవా ఎవరి రధములన్నిటిని అతని సేనను కలవరపరచగా అతను పారిపోయెను?
8. తమ శూరుడు చచ్చెనని ఎవరు పారిపోయిరి?
9. తనను చంపజూచిన సౌలు యెదుట నుండి తప్పించుకొని పారిపోయినదెవరు?
10. ఏ ప్రవక్త తన శిష్యునితో ఇశ్రాయేలు రాజుగా యెహును అభిషేకించి పారిపొమ్మనెను?
11. సొలొమోను వద్ద నుండి వచ్చిన వర్తమానము విని పారిపోయి బలిపీఠము కొమ్ములు పట్టుకొనినదెవరు?
12. ఇశ్రాయేలీయులు ఎదురుతిరిగినందున ఎవరు యెరూషలేమునకు పారిపోయెను?
13. యౌవనేచ్ఛల నుండి పారిపొమ్మని పౌలు ఎవరికి వ్రాసెను?
14. ఎవరిని ఎదిరించిన వాడు మన యొద్ద నుండి పారిపోవును?
15. యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించిన ఎన్ని త్రోవల నుండి శత్రువులు పారిపోవుదురు?
Result: