1ప్ర. కోడి తన "పిల్లలను"రెక్కల క్రింద చేర్చుకొనునట్లు నేనును నీ "పిల్లలను"చేర్చుకొనవలెనని యంటిని గాని మీరు ఒల్లకపోతిరని యేసు ఎవరితో అనెను?
2 . తన "పిల్లలు" తనవి కానట్టు వాటి యెడల కాఠిన్యము చూపునదెవరు?
3 ప్ర. ఎవరు తన "పిల్లలను" ఆస్తికర్తలుగా చేయును?
4 ప్ర. సీయోను కొండమీద నివసించు యెహోవా యెదుట ఎవరును అతని "పిల్లలును"సూచనలుగా మహాత్కార్యములుగా ఉన్నారు?
5 ప్ర.నీ "పిల్లలందరు"యెహోవా చేత ఏమి పొందుదురని యెహోవా తన జనముతో అనెను?
6ప్ర. వ్యభిచారము వలన పుట్టిన "పిల్లలను" తీసుకొనుమని యెహోవా ఎవరితో చెప్పెను?
7ప్ర. జనము మీదికి యెహోవా రేపిన ఎవరు "పిల్లల"మీద కరుణింపరు?
8."పిల్లలారా" అని యేసు ఎవరిని పిలిచెను?
9 ప్ర. ఎవరు విరోధులు దాని "పసిపిల్లలను"చెరపట్టుకొనిపోయిరి?
10 ప్ర. మనము దేవుని "పిల్లలమైతే"ఏమై యున్నాము?
11.పిల్లలు "మొదట ఏమి పొందవలెనని యేసు అనెను?
12. యెహోవా యందు ఏమిగల వాని"పిల్లలు" భోజనపు బల్లచుట్టు ఒలీవ మొక్కల వలె నుందురు?
13ప్ర. మనము దేవుని "పిల్లల"మని ఆత్మ ఎవరితో సాక్ష్యమిచ్చుచున్నాడు?
14. యెహోవా "పిల్లలను"సీయోనులో నుండి ఏమి చేయుచున్నాడు?
15 యెహోవా మన మీద నుంచిన ఆత్మయు నోటనుంచిన మాటలును మన నోటమన "పిల్లల"నోటవారి పిల్లల నోట నుండి తొలగిపోవు అని ఆయన ఏమి చేసెను?
Result: