1Q. పునరుత్థానము అనగా ఏమిటి?
2. పునరుత్థానమును, జీవమును ఎవరు?
3 Q. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని ఎవరు క్రీస్తు పునరుత్థానమును గూర్చి చెప్పెను?
4 Q. క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడెను?
5 Q. ఎక్కడ తాను సిలువ వేయబడుదునని మరల తిరిగి లేచెదనని యేసు తన శిష్యులతో చెప్పెను?
6 Q. ఎవరెవరికి ప్రభువై యుండుటకు క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను?
7 Q. మరణము క్రీస్తును బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు ఏమి తీసివేసి ఆయనను లేపెను?
8 Q. మనలను ఎలా తీర్చుటకు యేసు తిరిగి లేపబడెను?
9. ఇశ్రాయేలీయులు ఎవరిని చంపినా గాని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను?
10Q. మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేనిని బట్టి యేసు దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను?
11. క్రీస్తు యొక్క పునరుత్థానబలమును ఎరుగవలెనని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొన్నదెవరు?
12Q. దేని ప్రకారము క్రీస్తు మూడవ దినమున లేచెను?
13. మృతులలో నుండి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఉండి మనకొరకు క్రీస్తు ఏమి చేయుచున్నాడు?
14. మృతులలో నుండి దేవుడు యేసును లేపెననుటకు మేమే సాక్షులము అని ఎవరు చెప్పెను?
15 Q. మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచిన యేసుక్రీస్తు నుండి మనకు ఏమి కలుగును?
Result: