1. లేమిగలవారిని "పెంట"కుప్ప మీది నుండి లేవనెత్తువాడు యెహోవాయే అని ఎవరు అనెను?
2."పెంట" అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాని ఊడ్చి వేసినట్లు యెహోవా ఎవరి సంతతిని ఊడ్చి వేయుదుననెను?
3. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రేయేలు భూభాగమందున్న "పెంట"వలె నుండునని యెహోవా ఏ ప్రవక్త ద్వారా పలికించెను?
4. ఎవరు రాత్రి కాలమందు యెరూషలేము యొక్క "పెంట"ద్వారము దగ్గరకు పోయెను?
5. యెహోవాకు విరోధముగా నిబంధన చేసుకొనినవారు భూమికి "పెంట"అయిరి అని ఎవరు అనెను?
6. "పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు ఎవరు తమ చోటనే త్రొక్కబడుదురని యెహోవా సెలవిచ్చెను?
7. యెహోవా కొరకు చేయబడిన ఆజ్ఞను ఏమి చేసిన యెడల ఆ తప్పును బట్టి వాని యిల్లు "పెంట"రాశిగా చేయబడును?
8. చేల మీద "పెంట"పడునట్లు ఎవడును సమకూర్చకుండ మనుష్యుల శవములు పడునని యెహోవా ఎవరిని జనులకు చెప్పుమనెను?
9. ఏమి వ్యాపించు దినమున యెహోవా చేత హతులైన వారి శవములు "పెంట"వలె నేలమీద పడియుండును?
10. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించిన వారి కళేబరములు వేటి మధ్య "పెంట"వలె పడియున్నవి?
11. ఏమి తొడిగి పెంచబడిన వారు "పెంట"కుప్పలను కౌగలించుకొందురని యెహోవా సెలవివచ్చెను?
12. ఎవరు తన కలను దాని భావమును చెప్పని వారి యిండ్లు "పెంట"కుప్పగా చేయబడుననెను?
13. యెహోవా దృష్టికి పాపము చేసిన వారి మీదకు ఆయన ఉపద్రవము రప్పించగా, వారి యొక్క ఏమి "పెంట"వలె పారవేయబడును?
14. .షడ్రకు, మెషెకు, ఆబేద్నగో అనువారి దేవుని ఏమి చేసిన వాని యిల్లు ఎప్పుడును "పెంట"కుప్పగా ఉండునని నెబుకద్నెజరు అనెను?
15. "పెంట"కుప్ప మీద నుండి ఎవరిని యెహోవా పైకెత్తువాడు?
Result: