1. దేవుని పెదవుల ఆజ్ఞను ఎవరు విడిచి తిరుగలేదు?
2. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏమై యున్నవి?
3. నీతిహీనుల పెదవుల క్రింద ఏమున్నది?
4. పగవాడు పెదవులతో మాయలు చేసి ఎక్కడ కపటము దాచుకొనును?
5. దేవుడు ఎవరి అపవిత్రపెదవులను, కారుతో తీసిన నిప్పుతో పవిత్రము చేసెను?
6. బుద్ధిహీనుల పెదవులు వాని ప్రాణమునకు ఏమి తెచ్చును?
7. దేని కంటే ఉత్తమమైన దేవుని కృపను పెదవులతో స్తుతించాలి?
8. జ్ఞానులు పెదవులు ఏమి వెదజల్లును?
9. నీ కౌగిటిలో పండుకొని యున్న దాని యెదుట పెదవుల యొక్క దేనికి కాపు పెట్టుకోవాలి?
10. పెదవులతో ఎటువంటి మాటలు చెప్పకూడదు?
11. యెహోవా తన నోట నుండి ఇచ్చిన వేటిని పెదవులతో వివరించాలి?
12. యెహోవా ఎటువంటి పెదవుల నుండి విడిపించును?
13. నీతిగల పెదవులు ఎవరికి సంతోషకరము?
14. పెదవుల వలన ఏమి అపాయకరమైన ఉరి?
15. సరియైన మాటలతో ఏమి ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనునట్లుండును?
Result: