Telugu Bible Quiz Topic wise: 536 || తెలుగు బైబుల్ క్విజ్ ("పొరుగువారు" అనే అంశము పై క్విజ్)

1. నీ "పొరుగువాని"మీద ఏమి పలుకకూడదు?
ⓐ అబధ్ధసాక్ష్యము
ⓑ వెకిలిమాటలు
ⓒ హేళనమాటలు
ⓓ దొంగసాక్ష్యము
2. నీ "పొరుగువానిది"ఏమి ఆశింపకూడదు?
ⓐ ధనము
ⓑ బంగారము
ⓒ ఆస్తి
ⓓ ఇల్లు
3. తన "పొరుగువాని" యొక్క దేనిని తీసివేయువాడు శాపగ్రస్తుడు?
ⓐ ప్రాకారమును
ⓑ ప్రహారీని
ⓒ సరిహద్దురాయిని
ⓓ ధనమును
4. చాటున తన "పొరుగువాని"ఏమి చేయువాడు శాపగ్రస్తుడు?
ⓐ తిట్టువాడు
ⓑ కొట్టువాడు
ⓒ త్రోయువాడు
ⓓ నెట్టువాడు
5. నీ "పొరుగువాని"భార్యను ఏమి చేయకూడదు?
ⓐ ఆశింపకూడదు
ⓑ తిట్టకూడదు
ⓒ కొట్టకూడదు
ⓓ పట్టుకొనకూడదు
6. ఎవడు తన "పొరుగువాని"కైనను దయతలచడు?
ⓐ మూర్ఖుడు
ⓑ భక్తిహీనుడు
ⓒ బుద్ధిహీనుడు
ⓓ మూఢుడు
7. ఏమి నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదనని నీ "పొరుగువానితో"అనకూడదు?
ⓐ వస్త్రము
ⓑ పానీయము
ⓒ ద్రవ్యము
ⓓ ధాన్యము
8. నీ "పొరుగువాడు"నీ యొద్ద ఎలా నివసించునపుడు వానికి అపకారము తలపెట్టకూడదు?
ⓐ ధైర్యముగా
ⓑ నమ్మకముగా
ⓒ సురక్షితముగా
ⓓ నిర్భయముగా
9. "పొరుగువానితో"ఏమి లేక వ్యాజ్యెమాడుటకు పోకూడదు?
ⓐ ఆలోచన
ⓑ తెలివి
ⓒ వివేచన
ⓓ బుద్ధి
10. ప్రతివాడు తన "పొరుగువానితో"ఏమి మాటలాడవలెను?
ⓐ మంచియే
ⓑ సత్యమే
ⓒ నమ్మకమైనవే
ⓓ ఆలోచించినవే
11. తన "పొరుగువాని" మీద ఎవడును ఏమి యోచించకూడదు?
ⓐ కపటము
ⓑ కుతంత్రము
ⓒ దుర్యోచన
ⓓ అసూయ
12. తన "పొరుగువాని" మీద ఏమి పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు?
ⓐ కొండెమాటలు
ⓑ నీచపలుకులు
ⓒ వదరుమాటలు
ⓓ కూటసాక్ష్యము
13. నీ "పొరుగువానితో"వ్యాజ్యెమాడవచ్చును గాని ఏమి బయటపెట్టకూడదు?
ⓐ పరుని రహస్యములు
ⓑ పరుని పనులు
ⓒ పరుని గుట్టు
ⓓ పరుని ఆలోచనలు
14. యధార్ధమైన ప్రవర్తన గలవాడు తన "పొరుగువాని"మీద ఏమి మోపడు?
ⓐ నెపము
ⓑ నింద
ⓒ అబద్ధము
ⓓ చెడుపని
15. నిన్ను వలె నీ "పొరుగువానిని"ప్రేమింపవలె ననునది ఏమని యేసు చెప్పెను?
ⓐ మొదటి ఆజ్ఞ
ⓑ మూడవ ఆజ్ఞ
ⓒ రెండవ ఆజ్ఞ
ⓓ అయిదవ ఆజ్ఞ
Result: