Telugu Bible Quiz Topic wise: 539 || తెలుగు బైబుల్ క్విజ్ ("ప్రకాశము" అనే అంశము పై క్విజ్)

1. "ప్రకాశము" అనగా ఏమిటి?
ⓐ వెలుగు
ⓑ కాంతి
ⓒ వితానము
ⓓ పైవన్నియు
2 . పరిశుద్ధ గ్రంధములో "ప్రకాశము"అని అర్ధమిచ్చు పదము ఏది?
ⓐ మెషీము
ⓑ హోర్నాయిము
ⓒ కెబారు
ⓓ ఆజీరు
3 . ఆకాశము నుండి ఒక వెలుగు ఎవరి చుట్టు "ప్రకాశించెను"?
ⓐ బిలాము
ⓑ పౌలు
ⓒ ఏలీయా
ⓓ యోహాను
4 . ఎక్కడ అగ్నిజ్వాలా "ప్రకాశము"ను యెహోవా కలుగజేయును?
ⓐ సీయోను కొండలో
ⓑ అరణ్యములో
ⓒ షోమ్రోనులో
ⓓ ఆకాశములో
5 . యెహోవా యొద్ద నుండి కొండ దిగి వచ్చుచున్న ఎవరి ముఖచర్మము "ప్రకాశించెను"?
ⓐ యెహోషువ
ⓑ మోషే
ⓒ అహరోను
ⓓ హూరు
6 . ఉదయించే సూర్యుడు నీళ్ళ మీద "ప్రకాశింపగా" ఎవరు రక్తము అనుకొనిరి?
ⓐ అమ్మోనీయులు
ⓑ ఇశ్రాయేలీయులు
ⓒ మోయాబీయులు
ⓓ అష్షూరీయులు
7 . ఏమి గల దేశ నివాసుల మీద వెలుగు "ప్రకాశించెను"?
ⓐ చీకటి
ⓑ అంధకారము
ⓒ మరణచ్ఛాయ
ⓓ మబ్బులు
8 . రాజు ముఖ "ప్రకాశము" వలన ఏమి కలుగును?
ⓐ సంపద
ⓑ ఐశ్వర్యము
ⓒ జీవము
ⓓ ఓదార్పు
9 . యెహోవా తన జనుల దెబ్బలు కట్టి బాగుచేయు దినమున సూర్యుని "ప్రకాశము"ఎన్ని దినములది ఒక్కదినమునేప్రకాశించునట్లుండును?
ⓐ మాసము
ⓑ ఏడు
ⓒ పది
ⓓ ముప్పది
10 . తన చేతికర్ర కొనతో తేనెను తీసుకుని నోటిలో పెట్టుకొనిన ఎవరి కన్నులు "ప్రకాశించెను"?
ⓐ యోనాతాను
ⓑ సమ్సోను
ⓒ ఎలీషా
ⓓ దావీదు
11 . మండుచు "ప్రకాశించుచున్న" దీపము ఎవరు?
ⓐ ఏలీయా
ⓑ బాప్తిస్మమిచ్చు యోహాను
ⓒ అరిమతయియ యోసేపు
ⓓ దావీదు
12 . యెహోవా "ప్రకాశమానమైన" దేనిని దయచేయును?
ⓐ మకుటము
ⓑ శిరస్త్రాణము
ⓒ కిరీటము
ⓓ భూషణము
13 . తన సన్నిధిని "ప్రకాశింపజేసి" ఏమి చేయును?
ⓐ నడుపును
ⓑ కరుణించును
ⓒ కాపాడును
ⓓ దయచూపును
14 . శిష్యుల యెదుట రూపాంతరము పొందినపుడు యేసు యొక్క ముఖము ఎవరి వలె "ప్రకాశించెను"?
ⓐ తేజోనక్షత్రము
ⓑ చంద్రుని
ⓒ సూర్యుని
ⓓ ఉల్కల
15 . దేవుడై ప్రభువే ఎక్కడ తన దాసుల మీద "ప్రకాశించును"?
ⓐ ఆలయములో
ⓑ మధ్యాకాశములో
ⓒ క్రొత్త భూమిమీద
ⓓ పరిశుధ్ధపట్టణములో
Result: