1ప్ర. యెహోవా నీవు చేసిన దానికి "ప్రతిఫలమిచ్చునని" ఎవరు రూతుతో అనెను?
2 . "ప్రతిఫలముగా" కలుగబోవు బహుమానము యందు దృష్టి యుంచినదెవరు?
3 ప్ర. ప్రభువు వలన దేనిని "ప్రతిఫలముగా" పొందుదుమని ఎరిగి ఆయన పనిని మనస్ఫూర్తిగా చేయవలెను?
4 ప్ర. దేవుడు వాని వాని యొక్క వేటి చొప్పున "ప్రతిఫలమిచ్చును"?
5.రహస్యమందు చూచు తండ్రికే కనబడవలెనని ఏమి చేయునప్పుడు ఆయన "ప్రతిఫలమిచ్చును"?
6.యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దేనికి "ప్రతిఫలము"?
7.శ్రమలతో కూడిన దేనికి "ప్రతిఫలముగా" గొప్ప బహుమానము కలుగును?
8 ప్ర. ఏమి తీర్చుట నా పని,నేనే "ప్రతిఫలము" నిత్తును అని ప్రభువు చెప్పెను?
9 ప్ర. పౌలునకు కీడు చేసిన ఏ కంచరివానికి వాని క్రియల చొప్పున ప్రభువు "ప్రతిఫలమిచ్చునని" పౌలు అనెను?
10. తళతళలాడు ఏమి నూరి యెహోవాను ద్వేషించువారికి ఆయన "ప్రతిఫలమిచ్చును"?
11.మహోన్నతుని చాటున నివసించువారు కన్నులారా చూచుచుండగా ఎవరికి "ప్రతిఫలము" కలుగును?
12. పగవానికి ఏమి పెట్టిన యెడల యెహోవా "ప్రతిఫలమిచ్చును"?
13. ఎవరు తమ దుష్ ప్రవర్తనకు "ప్రతిఫలముగా" హాని అనుభవించుదురు?
14. మనలను ఏమి చేయువానికి "ప్రతిఫలమిచ్చెదనని” అనుకొనకూడదు?
15 ప్ర. ఎవరి ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన "ప్రతిఫలము" పొందెను?
Result: