1. దేని "ప్రధమఫలములలో"మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను?
2. భూఫలములన్నిటిలోను "ప్రధమఫలములను"దేనిలో ఉంచి యెహోవా మందిరమునకు తీసుకొని వెళ్లవలెను?
3. పులిసిన దానిని తేనెను "ప్రధమఫలముగా" అర్పించవచ్చును గాని ఎలా యెహోవాకు దహింపవలదు?
4. ఎటువంటి భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి యెహోవాకు "ప్రధమఫలముల"నైవేద్యముగా అర్పింపవలెను?
5. యెహోవా మందిరమునకు కావలసి వచ్చినప్పుడెల్ల "ప్రధమ ఫలములను"తీసుకొని వచ్చునట్లుగా నియమించితినని ఎవరు అనెను?
6. దేని అంతటిలో "ప్రధమ ఫలములను"ఇచ్చి యెహోవాను ఘనపరచవలెను?
7. ప్రధమఫలములు"అర్పించు పండుగను ఏ పండుగ అని అందురు?
8. యెహోవా యొక్క రాబడికి "ప్రధమఫలము" ఇశ్రాయేలు ఆయెనని ఎవరు అనెను?
9. ఏ పిండితో రెండు రొట్టెలను అల్లాడించు ఆర్పణముగా చేసి పులియబెట్టి కాల్చినది యెహోవాకు "ప్రధమ ఫలముల"ఆర్పణము?
10. నీవు నాకిచ్చిన భూమి యొక్క "ప్రధమఫలములను"తెచ్చితినని యెహోవాతో చెప్పి వాటిని ఎక్కడ దాచిపెట్టవలెను?
11. జనులు యెహోవాకు తెచ్చు "ప్రధమఫలములు" నీవి యగునని ఆయన ఎవరితో చెప్పెను?
12. ఆత్మ యొక్క "ప్రధమఫలములు" నొందిన మనము దేని యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము?
13. ప్రస్తెఫను యింటివారు దేని యొక్క "ప్రధమఫలమై "యున్నారని పౌలు అనెను?
14. నా ప్రియుడగు ఎపైనెటు ఎక్కడ క్రీస్తుకు "ప్రధమఫలము"అని పౌలు అనెను?
15. నిద్రించిన వారిలో "ప్రధమ ఫలముగా"క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని పౌలు ఏ సంఘముతో అనెను?
Result: