Telugu Bible Quiz Topic wise: 544 || తెలుగు బైబుల్ క్విజ్ ("ప్రయాసము" అనే అంశముపై క్విజ్)

1. మనుష్యుల ప్రయాసము తమయొక్క దేనికై యున్నది?
ⓐ దేహమునకు
ⓑ అందమునకు
ⓒ నోటికి
ⓓ ముఖమునకు
2. దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసిన ప్రయాసము ఎటువంటిది?
ⓐ భయంకరము
ⓑ ఆందోళనకరము
ⓒ బహుభారము
ⓓ బహుకఠినము
3. సూర్యుని క్రింద ప్రయాసపడి చేసిన వేటిని విడిచిపెట్టవలెను?
ⓐ పనులన్నిటిని
ⓑ కష్టములను
ⓒ భారములను
ⓓ కూర్పులను
4. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలు వ్యర్ధములై దేనికై ప్రయాసపడినట్టున్నవి?
ⓐ వట్టిగా
ⓑ గాలికై
ⓒ ఊరికినే
ⓓ కాలయాపనకై
5. "ఒక గాలికి ప్రయాసపడినట్టుంది", అను మాట ప్రసంగి గ్రంధములో ఎన్నిసార్లు కలదు?
ⓐ యేడు
ⓑ అయిదు
ⓒ ఆరు
ⓓ ఎనిమిది
6. ఒకడు వేటితో ప్రయాసపడి ఏదో ఒక పని చేయును?
ⓐ జ్ఞానము
ⓑ తెలివి
ⓒ యుక్టి
ⓓ పైవన్నీ
7 . జ్ఞానము తెలివి యుక్తితో ప్రయాసపడిన ఒకడు ప్రయాసపడని వానికి ఎలా ఇచ్చివేయవలసి వచ్చును?
ⓐ స్వాస్థ్యముగా
ⓑ ఆస్తిగా
ⓒ ద్రవ్యముగా
ⓓ ధనముగా
8 . సూర్యుని క్రింద పడిన ప్రయాసమంతయు ఏమై యున్నది?
ⓐ బలహీనత-వ్యసనము
ⓑ బుద్ధిహీనత - వ్యర్ధము
ⓒ అజ్ఞానము -అసహ్యము
ⓓ పైవన్నియును
9 . దేనిని ప్రకటించుటలో సమయమనక, అసమయమనక ప్రయాసపడవలెను?
ⓐ వాక్యమును
ⓑ సువార్తను
ⓒ బోధను
ⓓ ప్రకటనను
10 . సంఘము కొరకు పడిన ప్రయాసము ఎవరి యందు వ్యర్ధము కాదు?
ⓐ విశ్వాసుల
ⓑ ప్రభువు
ⓒ పెద్దల
ⓓ బోధకుల
11. బలముగా కార్యసిద్ధి కలుగచేయు దేవుని క్రియాశక్తిని బట్టి పోరాడుచు ప్రయాసపడుచున్నదెవరు?
ⓐ పేతురు
ⓑ యాకోబు
ⓒ పౌలు
ⓓ యోహాను
12 . రోమా సంఘము కొరకు బహుగా ప్రయాసపడిన స్త్రీ ఎవరు?
ⓐ ఫీబే
ⓑ ప్రిస్కిల్ల
ⓒ పెర్సిసు
ⓓ మరియ
13 . ఏమి సంపాదించుకొనుటకు ప్రయాసపడవలెను?
ⓐ నీతిని -భక్తిని
ⓑ విశ్వాసమును - ప్రేమను
ⓒ ఓర్పును - సాత్వికమును
ⓓ పైవన్నియు
14 . ప్రయాసపడినపుడు తోడుగా యుండేది ఏమిటి?
ⓐ దేవుని కృప
ⓑ బలము
ⓒ దేవుని దయ
ⓓ శక్తి
15 . ప్రయాసపడి ఏమి మోయుచున్నవారు క్రీస్తు నొద్దకు రావలెను?
ⓐ బరువు
ⓑ మోత
ⓒ రాయి
ⓓ భారము
Result: