1. ప్రవక్తలు అనగా ఎవరు?
2. ఎవరు యెహోవా ప్రవక్తగా స్థిరపడెనని ఇశ్రాయేలీయులు తెలుసుకొనిరి?
3. ఎప్పుడు లేచి యెహోవా తన జనుల యొద్దకు ప్రవక్తలను పంపెను?
4. తమ్మును తామే ప్రవక్తలుగా ఏర్పర్చుకొనువారిని ఏమందురు?
5. అబద్ధప్రవక్తలు ప్రజలలో నున్నారని ఎవరు చెప్పుచుండెను?
6. యెహోవా యొద్ద నుండి పంపబడని ఏ ప్రవక్త ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేసెను?
7. ఏ ప్రవక్తిని నెహెమ్యాను భయపెట్టవలెనని కనిపెట్టుకొనియుండెను?
8. యెహోవా నామమును బట్టి అబద్ధప్రవచనములు ప్రవచించు ఆహాబు ఎవరి కుమారుడు?
9. ఏ ప్రవక్త యెరూషలేములో పౌలు బంధింపబడునని ప్రవచించెను?
10. తమ మనస్సున ఏమి నిలుపు కొని ఇశ్రాయేలీయులు ప్రవక్త యొద్దకు వచ్చుచున్నారు?
11. ఏ ప్రవక్త ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచును?
12. అబద్దపు మాటలను యెహోవా నామమున ప్రకటించిన ప్రవక్తయైన మయాశేయా కుమారుడెవరు?
13. ఏ ప్రవక్త రెహబాము యూదా అధిపతులకు యెహోవా వాక్కును ప్రకటింపగా వారు యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి?
14. ప్రవక్తలైన ఎవరు పెక్కుమాటలతో సహోదరులను ఆదరించెను?
15. ఏ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను జ్ఞాపకము చేసుకొనవలెను?
Result: