Telugu Bible Quiz Topic wise: 548 || తెలుగు బైబుల్ క్విజ్ ("ప్రవచనము" అనే అంశము పై క్విజ్-2)

① క్రీస్తు పుట్టుకను గురించి ఎక్కువగా ప్రవచించినదెవరు?
Ⓐ మోషే
Ⓑ యెషయా
Ⓒ యోబు
Ⓓ మీకా
② మోషే క్రీస్తును ఎవరిగా చెప్పెను?
Ⓐ కుమారుడిగా
Ⓑ సేవకునిగా
Ⓒ ప్రవక్తగా
Ⓓ రాజుగా
③ ఎవరికి యెహోవా రాజులు నీలో నుండి వచ్చెదరని క్రీస్తు గురించి చెప్పెను?
Ⓐ అబ్రాహాముకు
Ⓑ నోవహుకు
Ⓒ మోషేకు
Ⓓ దావీదుకు
④ నక్షత్రము యాకోబులో ఉదయించునని ఎవరు క్రీస్తును గురించి దేవోక్తి చెప్పెను?
Ⓐ యెషయా
Ⓑ యిర్మీయ
Ⓒ హబక్కూకు
Ⓓ బిలాము
⑤ ప్ర.స్వల్పగ్రామమైన యూదా ఎఫ్రాతాలో నుండి ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు వచ్చునని ఎవరు క్రీస్తును గురించి ప్రవచించెను?
Ⓐ జేకార్య
Ⓑ యిర్మీయా
Ⓒ మీకా
Ⓓ హగ్గయి
⑥ కన్యక గర్భవతియై కుమారుని కనును అను క్రీస్తును గురించిన ప్రవచనము యెషయా ఏ రాజుకు చెప్పెను?
Ⓐ ఆహాజుకు
Ⓑ ఆహాబుకు
Ⓒ అహజ్యాకు
Ⓓ ఆజర్యాకు
⑦ ఏమిగల దేశనివాసుల మీద వెలుగుగా క్రీస్తు ప్రకాశించునని యెషయా ప్రవచించెను?
Ⓐ మరణచ్చయ
Ⓑ తెగులు
Ⓒ అంధకారము
Ⓓ కరువు
⑧ రాజైన క్రీస్తు ఏమియై గాడిదను గాడిదపిల్లను ఎక్కి సీయోను నివాసుల యొద్దకు వచ్చుచున్నాడని జెకర్యా ప్రవచించెను?
Ⓐ నీతిపరుడును
Ⓑ రక్షణగలవాడును
Ⓒ దీనుడును
Ⓓ పైవన్నియు
⑨ క్రీస్తును చంపవలెనని హేరోదు రెండు సంవత్సరములు మొదలు తక్కువ వయస్సు పిల్లలను చంపించుట ఎవరు ప్రవచించెను?
Ⓐ యెషయా
Ⓑ యెహెజ్కేలు
Ⓒ యిర్మీయా
Ⓓ జెకర్యా
①⓪ ప్ర.కుమారుని ముద్దు పెట్టుకొనుమని క్రీస్తును గురించి ఎవరు ప్రవచించెను?
Ⓐ యోబు
Ⓑ దావీదు
Ⓒ జెపణ్యా
Ⓓ మలాకీ
①① నేను నీ శత్రువులను నీ యొక్క దేనిగా చేయువరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువైన తండ్రి ప్రభువైన క్రీస్తుతో చెప్పిన మాట దావీదు ప్రవచించెను?
Ⓐ పాదపీఠముగా
Ⓑ దాసులుగా
Ⓒ సేవకులుగా
Ⓓ పరిచారకులుగా
①② యెహోవా నామమందు భయభక్తులు గలవారగువారికి క్రీస్తు అనే నీతిసూర్యుడు ఉదయించునని ఎవరు ప్రవచించెను?
Ⓐ యోనా
Ⓑ మీకా
Ⓒ మలాకీ
Ⓓ హగ్గయి
①③ ఎవరికి వెలుగుగా యెహోవా క్రీస్తును నియమించియున్నాడని యెషయా ప్రవచించెను?
Ⓐ బీదలకు
Ⓑ భూరాజులకు
Ⓒ ధనవంతులకు
Ⓓ అన్యజనులకు
①④ అభిషక్తుడగు క్రీస్తు(మెస్సీయా) వచ్చువరకు ఏడు వారములు పట్టునని గబ్రియేలు దూత ఎవరికి చెప్పెను?
Ⓐ ఆమోసుకు
Ⓑ దానియేలుకు
Ⓒ హోషేయకు
Ⓓ మలాకీకి
①⑤ యెష్షయి మొద్దునుండి పుట్టిన చిగురు వంటి క్రీస్తుకు యెహోవా భయము ఎలా యుండునని యెషయా ప్రవచించెను?
Ⓐ పరిమళవాసనగా
Ⓑ సుగంధవాసనగా
Ⓒ మంచిసువాసనగా
Ⓓ ఇంపైన సువాసనగా
Result: