Telugu Bible Quiz Topic wise: 553 || తెలుగు బైబుల్ క్విజ్ ("ప్రాయశ్చిత్తము" అనే అంశముపై క్విజ్)

1. "ప్రాయశ్చిత్తము" అనగా హెబ్రీ భాషలో అర్ధము ఏమిటి?
ⓐ కప్పివేయబడుట
ⓑ విసిరివేయబడుట
ⓒ త్రొక్కివేయబడుట
ⓓ పాతగిలబడుట
2. "ప్రాయశ్చిత్తము" అను పదము పరిశుద్ధగ్రంధములో ఎన్నిసార్లు కలదు?
ⓐ మూడువందల రెండు
ⓑ నూట ఇరువదియైదు
ⓒ రెండువందల మూడు
ⓓ డెబ్బది యేడు
3. శారా యొద్ద నున్న వారందరి దృష్టికి "ప్రాయశ్చిత్తముగా"నుండనట్లు ఎవరు అబ్రాహామునకు వెయ్యిరూపాయిలిచ్చెను?
ⓐ ఫీకోలు
ⓑ ఫరో
ⓒ అబీమెలెకు
ⓓ హెజెరు
4. భర్తకు పుట్టు రోషము ఎటువంటిదైనపుడు "ప్రాయశ్చిత్తము"చేసినను అతడు లక్ష్యపెట్టడు.
ⓐ మహారౌద్రము
ⓑ మహోద్రేకము
ⓒ మహాకోపము
ⓓ మహాపౌరుషము
5. దేవుడైన యెహోవా సన్నిధిని ప్రజలు తమ నిమిత్తము "ప్రాయశ్చిత్తము"చేసుకొనుటకు ప్రాయశ్చిత్తార్ధ దినము ఎప్పుడు నియమింపబడెను?
ⓐ మూడవనెల ఒకటవదినము
ⓑ నాలుగవనెల రెండవదినము
ⓒ ఆరవనెల యేడవ దినము
ⓓ యేడవ నెల పదియవ దినము
6. యాజకులు ప్రజల పాపము నిమిత్తము బలులు అర్పించి "ప్రాయశ్చిత్తము"చేయగా జనులకు ఏమి కలుగును?
ⓐ విడుదల
ⓑ క్షమాపణ
ⓒ విముక్తి
ⓓ విమోచన
7. యాజకులు బలి అర్పించు దేని నిమిత్తము "ప్రాయశ్చిత్తము"చేసి దాని పరిశుద్ధపరచవలెను?
ⓐ ఆవరణము
ⓑ బలిపీఠము
ⓒ సన్నిధిబల్ల
ⓓ గుడారము
8. వ్యాధిచేత మంచమెక్కిన వాని యందు దేవుడు కరుణ జూపి ఎక్కడికి దిగిపోకుండా విడిపించినపుడు వాడు "ప్రాయశ్చిత్తము" దొరికెననును?
ⓐ భూమ్యాంతములోనికి
ⓑ భూదిగంతములోనికి
ⓒ పాతాళములోనికి
ⓓ నిత్యనరకములోనికి
9. ఎవని నిమిత్తము "ప్రాయశ్చిత్తము"చేయగలవాడొకడును లేడు?
ⓐ తన సహోదరుని
ⓑ తన బంధువుని
ⓒ తన స్నేహితుని
ⓓ తన పొరుగువాని
10. దేవుని విషయమందు ఆసక్తి గలవాడైన ఎవరు ఇశ్రాయేలీయుల నిమిత్తము "ప్రాయశ్చిత్తము"చేసెను?
ⓐ కాలేబు
ⓑ ఈతామారు
ⓒ ఫీనెహాసు
ⓓ యెహోషువ
11. మా అతిక్రమముల నిమిత్తను నీవే "ప్రాయశ్చిత్తము"చేయుదువని ఎవరు యెహోవాతో అనెను?
ⓐ నెహెమ్యా
ⓑ ఎజ్రా
ⓒ దానియేలు
ⓓ దావీదు
12. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను "ప్రాయశ్చిత్తము"చేయగా సిగ్గుపడి నోరుమూసుకొందువని ఎవరితో యెహోవా అనెను?
ⓐ బేతేలు
ⓑ షోమ్రోను
ⓒ యెరూషలేము
ⓓ అష్షూరు
13. సెరాపులలో ఒకడు కారుతో తీసిన నిప్పును ఎవరి నోటికి తగిలించి నీ పాపములకు "ప్రాయశ్చిత్తమాయె"ననెను?
ⓐ యెహెజ్కేలు
ⓑ యెషయా
ⓒ దానియేలు
ⓓ యిర్మీయా
14. తన పాపములకు "ప్రాయశ్చిత్తము" నొందినవాడు ఎటువంటివాడు?
ⓐ ధన్యుడు
ⓑ శ్రేష్టుడు
ⓒ దీనుడు
ⓓ మర్త్యుడు
15. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు "ప్రాయశ్చిత్తమై "యుండుటకు తన కుమారుని పంపెనని ఎవరు అనెను?
ⓐ పేతురు
ⓑ పౌలు
ⓒ యాకోబు
ⓓ యోహాను
Result: