1. ఎవరు పుట్టినప్పటి నుండి యెహోవా నామమున "ప్రార్ధన"చేయుట ఆరంభమైనది?
2. బేతేలునకును హాయికిని మధ్య బలిపీఠము కట్టి యెహోవా నామమున "ప్రార్ధన"చేసినదెవరు?
3.మా కొరకు యెహోవాను "ప్రార్ధన చేయుట మానవద్దని ఇశ్రాయేలీయులు ఎవరితో అనిరి?
4 ప్ర. ఎవరు "ప్రార్ధన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించివేసెను?
5 ప్ర. నీవు ఆయనకు "ప్రార్ధన"చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని ఎవరు యోబుతో అనెను?
6ప్ర.ఉదయమున నా "ప్రార్ధన"నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని ఎవరు యెహోవాతో అనెను?
7. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటను మాకు శక్తి చాలదు,నీవే మాకు దిక్కు అని యెహోవాకు "ప్రార్ధన"చేసినదెవరు?
8 ప్ర. యెహోవా దిక్కులేని ఎవరి "ప్రార్ధన"నిరాకరింపడు?
9 ప్ర. ఎవరు యేడ్చుచు పాపమును ఒప్పుకొని "ప్రార్ధన"చేసెను?
10 ప్ర.మీరు నాకు "ప్రార్ధన "చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతునని యెహోవా దేని చెరలో నున్న వారితో అనెను?
11ప్ర. ఎవరి " ప్రార్ధన "యెహోవాకు ఆనందకరము?
12. ఎవరి ప్రార్ధన "యెహోవా అంగీకరించును?
13 ప్ర. పగలు ఎప్పుడు "ప్రార్ధన "కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండిరి?
14ప్ర. ప్రభువు నామమును బట్టి "ప్రార్ధన"చేసి బాప్తిస్మము పొందుమని ఎవరు పౌలుతో చెప్పెను?
15: వాక్యము వలన యేసు నందు విశ్వాసముంచువారందరు ఏమై యుండవలెనని ఆయన "ప్రార్ధన"చేసెను?
Result: