Telugu Bible Quiz Topic wise: 557 || తెలుగు బైబుల్ క్విజ్ ("ప్రియము" అనే అంశము పై క్విజ్)

1. వేటిని "ప్రియము" గా ఎంచుకొనవలెను?
ⓐ విశ్వాస ప్రేమను
ⓑ కనికరమును దయను
ⓒ నిందను కీడును
ⓓ సత్యమును సమాధానమును
2. బంగారుకంటెను అపరంజికంటెను ఏవి "ప్రియము" గానున్నవి?
ⓐ అద్భుతకార్యాలు
ⓑ దేవుని ఆజ్ఞలు
ⓒ మనుష్యుని మాటలు
ⓓ వాగ్దానములు
3. ఎవరికి అబద్ధములు "ప్రియములు"?
ⓐ భక్తిహీనునికి
ⓑ కూటసాక్షికి
ⓒ అపవిత్రునికి
ⓓ సత్యసాక్షికి
4. ఎవరికి "ప్రియమైన" వస్తువులన్నిటిని శత్రువు కొల్లపెట్టును?
A .హిజ్కియా
ⓑ ఎఫ్రాయిము
ⓒ యెహోషాపాతు
ⓓ రెహబాము
5. పౌలు యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని దేనిని నాకెంత మాత్రమును "ప్రియమై"నదిగా ఎంచుకొనుటలేదు?
ⓐ శ్రమను
ⓑ ప్రాణమును
ⓒ ముల్లును
ⓓ లోకమును
6. హన్నా తనకు "ప్రియము" గా నున్నందున ఎల్కానా బల్యర్పణ చేసిననాడు ఆమెకు ఎన్నిపాళ్లు ఇచ్చుచు వచ్చెను?
ⓐ యేడుపాళ్లు
ⓑ మూడుపాళ్లు
ⓒ ఐదుపాళ్లు
ⓓ రెండుపాళ్లు
7. నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి "ప్రియము" గా నుండిన దానిబట్టి నేను నీకిక కీడుచేయనని ఎవరు దావీదుతో అనెను?
ⓐ నాబాలు
ⓑ అబ్నేరు
ⓒ సౌలు
ⓓ అబీషై
8. ఎవరి ప్రాణము యెహోవా దృష్టికి "ప్రియము" గా ఉండును?
ⓐ నిరుపేదల
ⓑ దరిద్రుల
ⓒ బీదల
ⓓ పైవారందరి
9. ఎవరు యెహోవాకు "ప్రియమైన" పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి?
ⓐ మిద్యానువారు
ⓑ యూదావారు
ⓒ కనానువారు
ⓓ యెరూషలేమువారు
10. నా ప్రాణము నీ దృష్టికి "ప్రియమైనది"గా ఉండనిమ్మని, ఏబది మందికి అధిపతియైనవాడు ఎవరితో మనవి చేసెను?
ⓐ అహజ్యా
ⓑ ఏలీయా
ⓒ అహాబు
ⓓ ఎలీషా
11. జ్ఞానము సంపాదించుట వేటి కంటే "ప్రియమైనది"?
ⓐ గభూషణములకంటే
ⓑ పగడములకంటె
ⓒ ధనఘనతలకంటే
ⓓ కొట్లలోధాన్యముకంటే
12. యెహోవావలన బలము నొందు మనుష్యులకు ఏమిచేయు మార్గములు అతి "ప్రియములు"?
ⓐ మేలుచేయు
ⓑ బసచేయు
ⓒ యాత్రచేయు
ⓓ గొప్పచేయు
13. దేని నివాసములన్నిటికంటె సీయోనుగుమ్మములు యెహోవాకు "ప్రియము"లైయున్నవి?
ⓐ ఐగుప్తు
ⓑ యాకోబు
ⓒ మోయబు
ⓓ మిద్యాను
14. మిక్కిలి స్వచ్ఛమైన దేవుని మాట ఎవరికి "ప్రియమైనది"?
ⓐ అధికారికి
ⓑ దాసునికి
ⓒ సైనికునికి
ⓓ సేవకునికి
15. నాకు "ప్రియము" గానున్న వేటితట్టు నాచేతులెత్తెదను?
ⓐ నీ క్రియలు
ⓑ నీ ఆలోచనల
ⓒ నీ ఆజ్ఞల
ⓓ నీ మార్గముల
Result: