1. దేనికి తగిన ఫలము ఫలించవలెను?
2 . జనులు హింసించి నిందించినపుడు మన ఫలము ఎక్కడ అధికమగును?
3 . ఏ ఫలము సమస్తవిధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది?
4 . మంచినేల నుండు విత్తనములను పోలినవారు ఎటువంటి మంచిమనస్సుతో వాక్యమును అంగీకరించి ఓపికతో ఫలించువారు?
5 . దేని సూచకమైన ద్రాక్షా చెట్లు ఫలమిచ్చును?
6. తొలకరి కడవరి వర్షము సమకూడు వరకు ఎవరు విలువైన భూఫలము కొరకు కనిపెట్టును?
7 . ఎవరు యెహోవా మాటను నమ్మి ఓర్పుతో సహించి వాగ్దానఫలము పొందెను?
8 . ఎక్కడ ఫలించెడి కొమ్మ యోసేపు?
9 . కోయువారు ఏమి పుచ్చుకొని నిత్యజీవార్ధమైన ఫలము సమకూర్చుకొనుచున్నారు?
10 . ఏ చెట్టు కాని ఫలములు ఫలించును?
11. యెష్షయి వేరుల నుండి ఏమి ఎదిగి ఫలించును?
12 . ఫలభరితమైన భూమిలో ఏమి దిగును?
13 . ఎక్కడ పడిన విత్తనములను పోలినవారు జీవసంబంధమైన వాటి వలన అణచి వేయబడి పరిపక్వముగా ఫలింపనివారు?
14 . మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి ఎక్కడ వేయబడును?
15 . ఫలములు ఫలించు చెట్టు ఎవరికి సాదృశ్యము?
Result: