① శ్రేష్టమైన "బంగారము"గల దేశము ఏది?
② హేతుకుమారుల యొద్ద పొలమును అబ్రాహాము ఎన్ని తులముల "వెండికి"కొనెను?
③ ఎంత ఎత్తుగల రెండు "బంగారు"కడియములను ఎలీయెజెరు రిబ్కాకు ఇచ్చెను?
④ కనిష్టుని గోనె మూతిలో తన "వెండి"గిన్నెను పెట్టుమని ఎవరు తన గృహనిర్వహకునికి చెప్పెను?
⑤ ఫరో యోసేపు మెడలో "బంగారు"గొలుసు వేసి తన యొక్క దేని మీద అతని నెక్కించెను?
⑥ "వెండికి "గని కలదు అని ఎవరు అనెను?
⑦. ఎక్కడ నుండి వచ్చిన "బంగారమును" సొలొమోను వాడెను?
⑧ "వెండి"లోని ఏమి తీసివేసిన యెడల పాత్ర సిద్ధపరచబడును?
⑨. ఎవరు తన కలలో చూచిన ప్రతిమ యొక్క "బంగారు"శిరస్సుఅతనే అని దానియేలు చెప్పెను?
①⓪. ఎప్పుడు "వెండి" త్రాడు విడిపోవును?
①①. యోబునకు అతని సహోదరులు అతని అక్కచెల్లెండ్రు "బంగారు"వైన వేటిని ఇచ్చిరి?
①② పదియేడు తులముల "వెండికి" భూమిని కొనినదెవరు?
①③. శపితమైన దానిలో ఎంత యెత్తుగల "బంగారు"కమ్మిని ఆకాను దొంగిలించెను?
①④. మట్టిమూసలో ఎలా కరిగి ఊదిన "వెండి" యంత పవిత్రమైనవి యెహోవా మాటలు?
①⑤. ఏమి గల "బంగారు"సరములు చేయింతుమని షూలమ్మితీతో ప్రియుడైన క్రీస్తు అనెను?
Result: