1 Q. ఏ బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుకొనుడి?
2Q. అనుదినము నా(దేవుని) గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని ఏమి వినువారు ధన్యులు?
3Q. ఏ బంధములు నన్ను (దావీదును) చుట్టుకొని యుండెను?
4Q. యేసురక్తము దేని నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము?
5Q. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా నిబంధన వాక్యములను విననొల్లనివాడు ఏమగును?
6Q. నయోమికి సమీపబంధువు ఎవరు?
7Q. మనము ఎవరి సంబంధులము?
8Q. దేవునికి, భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా మేఘములో దేవుడు ఏమి ఉంచెను?
9Q. ఎవరు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను?
10Q. పొలము లోకము; ఏవి రాజ్యసంబంధులు?
11Q. నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? అని దేవుడు ఎవరితో సెలవిచ్చెను?
12 Q. ఎవరు తన పాపపాశముల వలన బంధింపబడును?
13: ఎవరు నిబంధన మీరెను, పట్టణములను అవమాన పరచెను, నరులను తృణీకరించెను?
14Q. ఏ విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు?
15Q. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల ఏది వ్యర్థమగును?
Result: