Telugu Bible Quiz Topic wise: 571 || తెలుగు బైబుల్ క్విజ్ ( "బలము" అనే అంశముపై క్విజ్-2 )

1. Strength అనగా అర్ధము ఏమిటి?
Ⓐ బలము
Ⓑ దృఢము
Ⓒ శక్తి
Ⓓ పైవన్నీ
2. యెహోవా "బలమును"ప్రసిద్ధి చేయు దేనియందు ఆయనను స్తుతించుమని కీర్తనాకారుడు అనెను?
Ⓐ ఆకాశవిశాలమందు
Ⓑ పరిశుద్ధాలయమందు
Ⓒ ఉన్నతపర్వతమందు
Ⓓ ఎత్తైనదుర్గమునందు
3. యెహోవాయందు ఆనందించుట వలన మీరు "బలమొందుదురు"అని ఎవరు ఇశ్రాయేలీయులతో అనెను?
Ⓐ దానియేలు
Ⓑ నెహెమ్యా
Ⓒ ఎజ్రా
Ⓓ యిర్మీయా
4. యెహోవా యెహోవాయే నాకు "బలము"అని ఆయన దినమున మీరందురని ఎవరు ఇశ్రాయేలీయులతో అనెను?
Ⓐ మోషే
Ⓑ యెషయా
Ⓒ దావీదు
Ⓓ యిర్మీయా
5. ఏమైన వారికి యెహోవా "బలమిచ్చును"?
Ⓐ అలసిన
Ⓑ నీరసిల్లిన
Ⓒ పడిపోయిన
Ⓓ సొమ్మసిల్లిన
6. నీ "బలము "చేత సముద్రమును పాయలుగా చేసితివని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ ఆసాపు
Ⓑ నెహెమ్యా
Ⓒ ఏతాను
Ⓓ సొలొమోను
7. నా "బలమ" త్వరపడి నాకు ఏమి చేయుమని దావీదు యెహోవాతో అనెను?
Ⓐ ప్రమాణము
Ⓑ వాగ్దానము
Ⓒ సహాయము
Ⓓ విమోచనము
8. యెహోవా నామము "బలమైన"దేని వంటిది?
Ⓐ కోట
Ⓑ దుర్గము
Ⓒ కట్టడము
Ⓓ ప్రాకారము
9. యెహోవా ఎవరికి "బలము"ననుగ్రహించును?
Ⓐ తన ప్రవక్తలకు
Ⓑ తన సేవకులకు
Ⓓ తన భక్తులకు
Ⓓ తన ప్రజలకు
10. నీ యధిక"బలము"చేత భూమ్యాకాశములను సృజించితివని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ యెషయా
Ⓑ యిర్మీయా
Ⓒ యోవేలు
Ⓓ యెహెజ్కేలు
11. నీ "బలమును "గూర్చి నిన్ను నేను ఏమి చేసెదనని దావీదు యెహోవాతో అనెను?
Ⓐ స్తుతించెదనని
Ⓑ ఘనపరతునని
Ⓒ కీర్తించెదనని
Ⓓ కొనియాడెదనని
12. నా బలమును"యెహోవా దేనిగా చేసియున్నాడని యెరూషలేము అనుకొనెను?
Ⓐ శక్తిహీనతగా
Ⓑ బలహీనతగా
Ⓒ మతిహీనతగా
Ⓓ నిస్సహాయతగా
13. దేని "బలమును"అణచి దాని నుండి పొట్టేలును తప్పించుట ఎవరి వశము కాకపోయెనని దానియేలు అనెను?
Ⓐ సింహమును
Ⓑ చిరుతను
Ⓒ మేకపోతును
Ⓓ పక్షిరాజును
14. ఎవరి బలమును"అన్యులు మ్రింగివేసిరి?
Ⓐ ఎఫ్రాయిము
Ⓑ ఇశ్రాయేలు
Ⓒ బెన్యామీను
Ⓓ మనషే
15. దూరమున నివసించు "బలము"గల అన్యజనులకు యెహోవా తీర్పు తీర్చునని ఎవరు అనెను?
Ⓐ హగ్గయి
Ⓑ మలాకీ
Ⓒ మీకా
Ⓓ జెఫన్యా
Result: