1Q. యెహోవాకు మొదటగా ఎవరు "బలిపీఠము" కట్టి, దహనబలి అర్పించెను?
2Q. మోషే ఒక "బలిపీఠము"ను కట్టి దానికి ఏమని పేరు పెట్టెను?
3Q. బేతేలునకును హాయికిని మధ్యను యెహోవాకు "బలిపీఠము"ను కట్టి, ప్రార్ధన చేసినదెవరు?
4Q. యెహోవా "బలిపీఠము" నొద్ద వేటికి నివాసము దొరికెను?
5Q. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును "బలిపీఠము" మీద అర్పించినప్పుడు అతడు వేటి వలన నీతిమంతుడని తీర్పు పొందెను?
6Q. నీవు "బలిపీఠము" నొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి ఏమి కలిగినయెడల యర్పణము విడిచిపెట్టి, వెళ్లి నీ సహోదరునితో సమాధానపడవలెను?
7Q. "బలిపీఠము" మీద ఏది నిత్యము మండుచుండవలెను?
8Q. యొర్దాను ప్రదేశములో కనానుదేశము నెదుట ఎవరు "బలిపీఠమును" కట్టిరి?
9Q. యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లములో యెహోవా నామమున ఒక "బలిపీఠము" కట్టించుమని దావీదుతో ఎవరు చెప్పెను?
10Q. ఇశ్రాయేలీయుల సమాజకులందరు చూచుచుండగా యెహోవా "బలిపీఠము" ఎదుట ఎవరు నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి ప్రార్ధించెను?
11. ఎఫ్రయిము దేనికి ఆధారమగు "బలిపీఠము"లను ఎన్నెన్నో కట్టెను?
12Q. ఇశ్రాయేలీయులు ఏ లోయలోనున్న బయలునకు "బలిపీఠము"లను కట్టించిరి?
13 Q. యెహోవా "బలిపీఠము"ను మీరు వేటితో తడుపుదురు గనుక ఆయన మీ అర్పణలను అంగీకరింపకయున్నాడు?
14. మనకొక "బలిపీఠమున్నది"(యేసు); కాబట్టి యేసు నామమును ఒప్పుకొనుచు, మనము ఏమి అర్పించుదము?
15Q. పరిశుద్ధ గ్రంథమందు ఎంతమంది "బలిపీఠము"లను నిర్మించారు?
Result: