1. బారూకు ఎవరి అనుచరుడు?
2. బారూకుయొక్క కాలము?
3. "బారూకు" అనగా అర్ధము ఏమిటి?
4. బారూకు తండ్రి పేరేమిటి?
5. "నేరియా" అనగా అర్ధము ఏమిటి?
6. ఎవరెవరి గురించి యెహోవా చెప్పిన మాటలను యిర్మీయా నోటిమాటను బట్టి బారూకు పుస్తకములో వ్రాసెను?
7. యూదా ఇశ్రాయేలు సమస్త జనులు ఏమి విడిచి పశ్చాత్తాపపడుదురేమో అని యెహోవా యిర్మీయా ద్వారా బారూకు చేత తన మాటలు వ్రాయించెను?
8. యిర్మీయా ఆజ్ఞ ఇచ్చినట్టు బారూకు గ్రంధములోని మాటలు ఎక్కడ చదివి వినిపించెను?
9. బారూకు యెహోవా మాటల గ్రంధమును ఏ దేశములో ఉన్నప్పుడు వ్రాసెను?
10. యెహోవా నాకు ఏమి పుట్టించెనని బారూకు అనుకొనెను?
11. యెహోవా నాకు దుఃఖము కలుగజేయగా దేని చేత ఆయాసపడుచున్నానని బారూకు అనుకొనెను?
12. నీ నిమిత్తము వేటిని వెదకవద్దని యెహోవా బారూకుకు చెప్పెను?
13. బారూకు వెళ్ళు ప్రతి స్థలములన్నిటిలో అతని యొక్క దేనిని దోపుడు సొమ్ము దొరికినట్టుగా యెహోవా ఆతనికి ఇచ్చెను?
14. యిర్మీయా నోటి మాటను బట్టి యెహోవా మాటలను బారూకు వ్రాయగా యెహూది చదువగా ఏ రాజు దాని అగ్నిలో కాల్చెను?
15. రాజు కాల్చిన గ్రంధములోని మాటలు బారూకు మరల వ్రాసి అట్టివి అనేకములు ఏమి చేసెను?
Result: