1. ఎవరు సమస్త విషయములలో "సుబుద్ధి" గలిగి ప్రవర్తింపగా, యెహోవా అతనికి తోడుగా నుండెను?
2. నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు "బుద్ధి" చాలదని పలికినదెవరు?
3. ఎఫ్రాయిము "బుద్ధి"లేని పిరికిగుండెగల ఏమాయెను?
4. ఎవరికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న "బుద్ధి" పుట్టెను?
5. నా ప్రియమైన పిల్లలని మీకు "బుద్ధి"చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నానని పౌలు ఏ సంఘముతో చెప్పెను?
6. "బుద్ధి" జ్ఞానముల సర్వ సంపదలు ఆయన (యేసుక్రీస్తు)యందే ఏమైయున్నవి?
7. మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు "బుద్ధి"చెప్పిన తరువాత వానిని ఏమి చేయుము?
8. ఏ విధముగా నడుచుకొను వారికి "బుద్ధి" చెప్పుడి?
9. "ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు "బుద్ధి" కలుగుటకై వ్రాయబడెను" ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
10. యాజకుడైన యెహోయాదా తనకు "బుద్ధి" నేర్పువాడై యుండు దినములన్నిటిలో ఎవరు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను?
11. లూకా సువార్త 15వ అధ్యాయములో యేసు చెప్పిన ఉపమానంలో చిన్నకుమారునికి "బుద్ధి" వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకము చేసికొనెను?
12. ఎవరికి "బుద్ధి"చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును?
13. "బుద్ధి"లేని కుమారుడు తన తల్లికి ఏమి పుట్టించును?
14.మూఢత్వముచేత "బుద్ధి" మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే -?
15. ఆహా, దేవుని "బుద్ధి" జ్ఞానముల బాహుళ్యము ఎంతో - -?
Result: