1."భయపడకుడి" అని పరిశుద్ధగ్రంధములో ఎన్నిసార్లు కలదు?
2. భయము సంభవించిపుడు యెహోవాను ఏమి చేయాలి?
3. భయపడకుము నేను నీకు ఏమి చేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు?
4. భయపడకుడి, ఏమి కలిగి ధైర్యముగా నుండుడని యెహోవా అనెను?
5. యెహోవా ఎలా యున్నాడు గనుక మనము భయపడము
6. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నాకు ఏమై యున్నావని యెహోవా అనెను?
7. భయపడక మాటలాడుము నేను నీకు తోడై యున్నానని ప్రభువు ఎవరితో దర్శనములో అనెను?
8. చచ్చినవాని వలె ప్రభువు పాదములయొద్ద పడిన ఎవరితో భయపడకుమని ప్రభువు అనెను?
9. భయపడవద్దు, నమ్మికమాత్రముంచుమని, యేసు ఎవరితో అనెను?
10. భయపడక ధైర్యముగా ఉండుడని తత్తరిల్లు ఎవరితో అనమని యెహోవా సెలవిచ్చెను?
11. యెహోవా యొద్ద ఏమి చేసినపుడు భయములన్నిటిలో నుండి ఆయన తప్పించును?
12. దేవుని యందు ఏమి యుంచి మనము భయపడకుండా యుండవలెను?
13. యెహోవా ఆజ్ఞను మీరి ఆయనకు భయపడి దాగినదెవరు?
14. భయము పుట్టించు దేనిని యెహోవా కొట్టివేయును?
15. ప్రభువు నా సహాయుడు, నేను భయపడను అని ఎలా చెప్పగలవారమై యున్నాము?
Result: