Telugu Bible Quiz Topic wise: 590 || తెలుగు బైబుల్ క్విజ్ ( భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్విజ్ )

స్వాతంత్య్రము అనగా ఏమిటి?
ⓐ దాస్యత్వము నుండి విమోచన
ⓑ నిర్బంధము నుండి విడుదల
ⓒ చెర నుండి విముక్తి
ⓓ పైవన్నియు
దావీదు నందు అధిక స్వాతంత్ర్యము కలవారు ఎవరు?
ⓐ యూదా వారు
ⓑ కుమారులు
ⓒ ఇశ్రాయేలీయులు
ⓓ దేశ జనులు
హెబ్రీయుడైన దాసుడు ఏ సంవత్సరమున స్వతంత్రుడగును?
ⓐ అయిదవ
ⓑ యేడవ
ⓒ ఒకటవ
ⓓ మూడవ
స్వతంత్రుడనై పోనొల్లననిన దాసుని చెవిని తలుపు లేదా ద్వారబంధము నొద్ద దేనితో గుచ్చవలెను?
ⓐ కదురుతో
ⓑ సూదితో
ⓒ ఈటేతో
ⓓ బల్లెముతో
ఎవరు మనలను స్వతంత్రులుగా చేసెను?
ⓐ రాజులు
ⓑ కుమారుడు
ⓒ అధిపతులు
ⓓ యుద్ధవీరులు
ప్రభువు యొక్క ఏమి ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును?
ⓐ మాట
ⓑ ఛాయ
ⓒ ఆత్మ
ⓓ రూపము
స్వతంత్రులై యుండి దేనిని కప్పిపుచ్చుకొనుటకు ఆ స్వతంత్ర్యమును వినియోగపరచకూడదు?
ⓐ దుర్నీతికి
ⓑ స్వార్ధమునకు
ⓒ అవసరతకు
ⓓ దుష్టత్వమునకు
అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు ఏమి కలుగజేయవు?
ⓐ క్షేమాభివృద్ధి
ⓑ ఉన్నతాభివృద్ధి
ⓒ గొప్పతనమును
ⓓ పేరు ప్రఖ్యాతలను
వేరొకని యొక్క దేనిని బట్టి స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
ⓐ అభిప్రాయమును
ⓑ మనస్సాక్షిని
ⓒ ఆలోచనలను
ⓓ హృదయ యోచనను
మనకు కలిగిన స్వాతంత్ర్యమును బట్టి ఎవరికి అభ్యంతరము కలుగకుండా చూచుకొనవలెను?
ⓐ పొరుగువారికి
ⓑ ఇంటివారికి
ⓒ బలహీనులకు
ⓓ అన్యజనులకు
తన దాసుని పోగొట్టిన యెడల, ఆ కన్నుకు కలిగిన దేనిని బట్టి అతనిని స్వతంత్రునిగా పోనియ్యవలెను?
ⓐ బాధను
ⓑ గాయమును
ⓒ దెబ్బను
ⓓ హానిని
స్వాతంత్రమును వేటికి హేతువు చేసికొనకూడదు?
ⓐ యిచ్చలకు
ⓑ కోరికలకు
ⓒ శారీరక్రియలకు
ⓓ నేత్రాశలకు
అందరి విషయములో స్వతంత్రుడై యున్నను ఎక్కువ మందిని సంపాదించుటకు దాసుడైనదెవరు?
ⓐ యోహాను
ⓑ పౌలు
ⓒ ఫెలిప్పు
ⓓ పేతురు
ఏది మనలను స్వతంత్రులుగా చేయుట వలన మనము నిజముగా స్వతంత్రులమై యున్నాము?
ⓐ సత్యము
ⓑ యుద్ధము
ⓒ సంధి
ⓓ రాయబారము
క్రీస్తును ధరించుకొని ఆయన యందు ఎలా యున్నయెడల దాసుడని స్వతంత్రుడని లేదు?
ⓐ వినయముగా
ⓑ భయభక్తిగా
ⓒ నిలకడ
ⓓ ఏకముగా
Result: