Telugu Bible Quiz Topic wise: 591 || తెలుగు బైబుల్ క్విజ్ ( "భార్య" అనే అంశముపై క్విజ్ )

1. పురుషుడు తన భార్యకు ఏమై యుండెను?
ⓐ శిరస్సై
ⓑ కాపరియై
ⓒ తోడుయై
ⓓ యజమానుడై
2. భార్య దొరికిన వానికి ఏమి దొరికెను?
ⓐ ఆస్తి
ⓑ మేలు
ⓒ సంపద
ⓓ మర్యాద
3. పురుషుడు తన యౌవనకాల భార్యను బట్టి ఏమి చేయవలెను?
ⓐ విచారించవలెను
ⓑ బాధనొందవలెను
ⓒ సంతోషించవలెను
ⓓ నవ్వుకొనవలెను
4. ఎటువంటి భార్య దొరుకుట అరుదు?
ⓐ రూపసియైన
ⓑ సుబుద్ధియైన
ⓒ అందమైన
ⓓ గుణవతియైన
5. ఏమియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును?
ⓐ మూర్ఖుడైన
ⓑ అవిశ్వాసి
ⓒ కోపిష్టియైన
ⓓ ద్రోహియైన
6. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను ఏమి చేయును?
ⓐ ప్రేమించును
ⓑ హత్తుకొనును
ⓒ పోషించును
ⓓ కాపాడును
7. సుబుద్ధి రూపసియైన ఏ భార్య దుర్మార్గుడు మోటువాడైన భర్తతో కాపురము చేసెను?
ⓐ మేరబు
ⓑ అజుబా
ⓒ అబీగయీలు
ⓓ అబీషగు
8. తన తండ్రి భార్యతో శయనించువాడు ఏమగును?
ⓐ హంతకుడు
ⓑ ద్రోహి
ⓒ పాపాత్ముడు
ⓓ శాపగ్రస్తుడు
9. నా ఊపిరి నా భార్యకు అసహ్యము అని ఎవరు అనెను?
ⓐ హిజ్కియా
ⓑ దావీదు
ⓒ యోబు
ⓓ హోషేయా
10. భార్య తన భర్త యెడల ఏమి కలిగియుండునట్లు చూచుకొనవలెను?
ⓐ భయము
ⓑ ప్రేమ
ⓒ భక్తి
ⓓ కరుణ
11. ఎవని భార్య తన భర్త వలె అబద్ధమాడి తన ప్రాణము కోల్పోయెను?
ⓐ అననీయ
ⓑ ఇస్కరియోతు యూదా
ⓒ యరొబాము
ⓓ యెహోరాము
12. భార్యలు ఎప్పుడు తమ పురుషులకు లోబడి యుండవలెను?
ⓐ ప్రతివిషయములో
ⓑ ఎల్లప్పుడు
ⓒ అన్నివేళలా
ⓓ నిరంతరము
13. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్ళతో ఏమి యైన భార్య సమానము?
ⓐ అత్యాశగల
ⓑ గయ్యాళి
ⓒ దురాశగల
ⓓ మూర్ఖురాలు
14. గుణవతి యైన భార్య దేని కంటే అమూల్యము ?
ⓐ పగడము
ⓑ రత్నము
ⓒ ముత్యము
ⓓ నీలము
15. ఎవరి భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది?
ⓐ గొర్రెపిల్ల
ⓑ దావీదు
ⓒ సొలొమోను
ⓓ యోవాషు
Result: