1. పలుకు వినుమని లెమెకు తన భార్యలైన ఎవరితో అనెను?
2. యెహోవా నాకును నీకును న్యాయము తీర్చును గాక; అని ఏభార్య తన భర్తయైన ఎవరితో అనెను?
3. ఎవరి వలన నా ప్రాణము విసికినదని రిబ్కా తన భర్తయైన ఇస్సాకుతో అనెను?
4. మీ తండ్రి యొక్క ఏమి నా మీద నుండలేదని యాకోబు తన భార్యలైన లేయా రాహేలులతో అనెను?
5. దేనిని బట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివని సిప్పోరా మోషేతో అనెను?
6. ఎంతమంది కుమాళ్లకంటే నేను నీకు విశేషమైనవాడను కానా?అని ఎల్కానా తన భార్యయైన హన్నాతో అనెను?
7. మేము నిన్ను ఏమి చేయునట్లు నీపేరేమని మానోహ ఆతని భార్య యెహోవా దూతను అడిగిరి?
8. తన భర్తయైన దావీదు చంపబడకుండా కాపాడిన భార్య ఎవరు?
9. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదనుకొనిన ఎవరు ఆమె కొరకు నగరు కట్టించెను?
10. తన భార్యయైన యెజెబెలు యొక్క దేనిచేత యెహోవా దృష్టికి తన్నుతాను ఆహాబు అమ్ముకొనెను?
11. దేవుని ఏమి చేసి మరణము కమ్మని యోబు భార్య అతనితో అనెను?
12. దేనిని అనుసరించువారందరిని మించినదానవని గుణవతి అయిన భార్యను ఆమె భర్త పొగడును?
13. జనసంఖ్యలో వ్రాయబడుటకు యోసేపు తనకు భార్యగా ప్రధానము చేయబడిన మరియతో గలిలయలోని ఎక్కడ నుండి దావీదు ఊరికి వెళ్లెను?
14. ఎక్కడ యున్న భార్యభర్తలైన ప్రిస్కిల్ల ఆకుల యొద్దకు పౌలు వచ్చెను?
15. తమ పొలమును అమ్మి కొంత దాచుకొని ఎవరి యొద్ద అబద్ధము చెప్పిన భార్యభర్తలైన సప్పీరా అననీయలు నశించిరి?
Result: