1. "LANGUAGE"అనగా ఏమిటి?
2. దేని యందంతట ఒక్క "భాష"యుండెను?
3. యెహోవా "భాషను"ఏమి చేసెను?
4. బిస్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షమున నున్నవారు రాజైన ఎవరికి సిరియ "భాషలో" ఉత్తరము వ్రాసిరి?
5. ఇశ్రాయేలీయులు యెహోవా సెలవిచ్చిన మాట విననియెడల ఏమి కలిగి వారికి రాని "భాష" కలిగిన జనమును వారి మీదకు రప్పించెదనని యెహోవా అనెను?
6. గొప్ప శబ్దముతో ప్రజల వినికిడిలో యూదా "భాష" తో మాట్లాడిన అష్షూరు రాజు సేవకుడు ఎవరు?
7. పెంతెకొస్తను పండుగ దినము కూడిన అందరు దేనితో నిండిన వారై అన్య "భాష"లతో మాటలాడసాగిరి?
8. మనుష్యుల దేవదూతల "భాష"లతో మాటలాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు దేని వలె నుందునని పౌలు అనెను?
9. "భాష"తో మాటలాడువాడు తనకే ఏమి కలుగజేసికొనును?
10. ఇదే నెమ్మది విశ్రాంతి అని చెప్పువాడు దేని చేతను అన్య "భాష"తోను జనులతో మాటలాడుచున్నాడు?
11. అన్య "భాషలు"మాటలాడు జనుల ద్వారా తన జనులతో మాటలాడుదునని ప్రభువు చెప్పుచున్నాడని ఎక్కడ వ్రాయబడియున్నది?
12. ఎటువంటి గంభీర "భాష"యు పలుకు జనమును నీవిక చూడవని యెహోవా తన జనులతో చెప్పెను?
13. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులైన వారికి కల్దీయుల "భాష" నేర్పమని ఎవరు ఆజ్ఞాపించెను?
14. "భాష"తో మాటలాడువాడు ఏమి చెప్పు శక్తికలుగుటకై ప్రార్ధనచేయవలెను?
15. ప్రభువు ఏ "భాషలో" పౌలుతో మాటలాడెను?
Result: