Telugu Bible Quiz Topic wise: 597 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మంచము" అనే అంశము పై క్విజ్ )

1. భాషాను రాజైన ఓగు "మంచము"ఎటువంటిది?
ⓐ చెక్కది
ⓑ వెండిది
ⓒ ఇత్తడిది
ⓓ ఇనుపది
2. ఎవరు బలము తెచ్చుకొని తన "మంచము" మీద కూర్చుండెను?
ⓐ ఇస్సాకు
ⓑ బడ్జిల్లయి
ⓒ ఇశ్రాయేలు
ⓓ అమ్రాము
3. ఎవరు మూతిముడుచుకొని తన నగరునకు పోయి "మంచము" మీద పరుండెను?
ⓐ అబ్షాలోము
ⓑ ఆహాబు
ⓒ అదోనీయ
ⓓ అబీహు
4. షూనేములోని ఘనురాలైన స్త్రీ చనిపోయిన తన కుమారుని ఎవరి మంచము మీద పెట్టెను?
ⓐ దైవజనుని
ⓑ తన యొక్క
ⓒ తన భర్త
ⓓ తన కుమారుని
5. చనిపోయిన సారెపతు విధవరాలి కుమారుని "మంచము"మీద పరుండబెట్టి బ్రదికించినదెవరు?
ⓐ ఎలీషా
ⓑ ఏలీయా
ⓒ గేహాజీ
ⓓ హనన్యా
6. తన "మంచము"తనకు ఆదరణ ఇచ్చునని అనుకొనినదెవరు?
ⓐ ఆసా
ⓑ హిజ్కియా
ⓒ యోబు
ⓓ దావీదు
7. మంచము"మీద పరుండి ఏమి యోచించుచు దుష్కార్యములు చేయు వానికి శ్రమ?
ⓐ చెడుతలంపులు
ⓑ కపట ఆలోచనలు
ⓒ వేదన కలలు
ⓓ మోసపు క్రియలు
8. పడకటింటిలో "మంచము"మీద పరుండి యున్న ఎవరిని రేకాబు, బయనాయనులు కడుపులో పొడిచి చంపిరి?
ⓐ యోనాతానును
ⓑ మెరీబ్బయలును
ⓒ ఇష్బోషెతును
ⓓ ఇత్తయిని
9. దేవుని ప్రకటన గ్రహించు వారికి ఏమి పుట్టి పండుకొనుటకు "మంచము"చాలక యుండెను?
ⓐ మహా వణుకు
ⓑ మహా భయము
ⓒ మహా దిగులు
ⓓ మహా వేదన
10. " మంచము మీద నుండి దిగిరాకుండ నిశ్చయముగా మరణమవుదువని ఎవరి గురించి ఏలీయా చెప్పెను?
ⓐ ఆహజ్యా
ⓑ ఆహాబు
ⓒ హజయేలు
ⓓ ఆహాజు
11. ఎవరు "మంచము" మీద సాగిలపడి నమస్కారము చేసి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పెను?
ⓐ యాకోబు
ⓑ దావీదు
ⓒ ఇస్సాకు
ⓓ సొలొమోను
12. వ్యాధి చేత "మంచము"ఎక్కుట వలన ఒకడు ఏమి పొందును?
ⓐ మరణము
ⓑ జాగరణము
ⓒ శిక్షణము
ⓓ కారుణ్యము
13. ఎవరు పక్షవాయువు గల వానిని "మంచము"తో యేసు నొద్దకు తెచ్చినపుడు ఆయన వానిని స్వస్థపరచెను?
ⓐ పరిసయ్యులు
ⓑ సమరయులు
ⓒ శాస్త్రులు
ⓓ జనులు
14. నా "మంచము" మీద పరుండి నిన్ను ఏమి చేసుకొందునని కీర్తనాకారుడు అనెను?
ⓐ గురుతు
ⓑ గొప్ప
ⓒ జ్ఞాపకము
ⓓ వెదుకుదును
15. ఏ వ్యాధిగల వానిని "మంచము"పై మోసుకొని వచ్చి ఇంటి పెంకులు విప్పి యేసు ముందుకు కొందరు మనుష్యులు దింపిరి?
ⓐ జలోదర రోగము
ⓑ కుష్టరోగము
ⓒ పక్షవాయువు
ⓓ శరీర పుండు
Result: