1. నరుడు ఎలా నుండుట "మంచిది"కాదు అని యెహోవా అనుకొనెను?
2. మిక్కిలి భారమైన పని నీవు ఒక్కడవే చేయుట "మంచిది"కాదు అని ఎవరు మోషేతో అనెను?
3. "మంచిది", నీ మాట చొప్పుననే కానిమ్మని ఎవరు యాకోబుతో అనెను?
4. ఏ దేశము బహు "మంచిది"అని ఆదేశమును చూచిన మనుష్యులు తమ స్వజనులతో అనిరి?
5. ఏ రాజుకు వెట్ట కలుగుటకు ఒక చిన్నదాని వెదకుట "మంచిది"అని అతని సేవకులు అనిరి?
6. ఒకడు ఏమి లేకుండుట "మంచిది"కాదు?
7. "మంచిది"నిన్ను గూర్చి రాజుతో చెప్పెదనని బతైబ ఎవరితో అనెను?
8. ఏమి చూపుట "మంచిది"కాదు?
9. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు దేని కొరకు ఓపికతో కనిపెట్టుట "మంచిది"?
10. మన దేవునికి ఏమి చేయుట "మంచిది"?
11. నీవు వచ్చినది "మంచిది", ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నియు వినుటకై మేము కూడియున్నామని ఎవరు పేతురుతో అనెను?
12. ఎక్కడ నుండి "మంచిది"ఏదైనా రాగలదా? అని నతనయేలు అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అనెను?
13. శరీరమందు "మంచిది"ఏదియు నివసింపదని నేనెరుగుదును అని ఎవరు అనెను?
14. దేనిని బట్టి హృదయమును స్థిరపరచుకొనుట "మంచిది"?
15. నీ యొక్క ఎవరికి అడ్డము కలుగజేయునది మానివేయుట "మంచిది"?
Result: