1. "మెడ"జీవులలో వేటికి కలిపెడి భాగము?
2. ఎవరి "మెడ" యినుప నరమని యెహోవా చెప్పెను?
3. ఎవరి నున్నని "మెడకు"కాడి కట్టుదును అని యెహోవా అనెను
4. యెరూషలేము యొక్క వేటిని యెహోవా కాడి కట్టినట్టు కట్టగా అవి వారి "మెడ"మీదికెక్కెను?
5. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు దేని "మెడను" విరుచువానివంటివాడు?
6. ఇశ్రాయేలు యొక్క "మెడ"మీద నుండి ఎవరి కాడి కొట్టివేయబడునని యెహోవా సెలవిచ్చెను?
7. కాని పులుపులను చేయించుకొని తన "మెడకు" ప్ర. కట్టుకొనుమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
8. సీయోను కుమార్తెలు గర్విష్టురాండ్రై "మెడ" చాచి నడుచుచు ఎలా చూచుచుండెను?
9. యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల శత్రువులు ఇశ్రాయేలు వారి "మెడ" మీద ఏ కాడి యుంచుదురని మోషే చెప్పెను?
10. దుష్టులకుటుంబికులలో ప్రధానుడొకడుండకుండా వారి తలను "మెడను "ఖండించి నిర్మూలము చేయుచున్నావని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
11. ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినక తమ "మెడను"వంచక ఎవరికంటే మరి దుష్టులైరి?
12. యెహోవా నా "మెడ"పట్టుకొని నన్ను తుత్తునియలుగా చేసియుండెనని ఎవరు అనెను?
13. ఎవరి చెయ్యి అతని శత్రువుల "మెడ" మీద ఉండును?
14. క్రీస్తును విశ్వసించిన చిన్నవారిలో ఒకనిని అభ్యంతర పరచిన వాని "మెడకు"ఏమి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు?
15. ఎవరిని తన "మెడ"కట్లు విప్పుకొనుమని యెహోవా సెలవిచ్చుచుండెను?
Result: