Telugu Bible Quiz Topic wise: 606 || తెలుగు బైబుల్ క్విజ్ ( "మరువక" అనే అంశముపై క్విజ్ )

1Q. నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను వేటిని నేను "మరువను"?
A దేవుని కట్టడలను
B దేవుని ఆజ్ఞలను
C దేవుని ఉపదేశములను
D దేవుని వాగ్దానములను
2. కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును మరియు దేనిని "మరువుము"?
A స్నేహితులను
B పరిశుద్దాత్ముని
C నీ భర్త ఇంటిని
D నీ తండ్రి ఇంటిని
3Q. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన వేటిలో దేనిని "మరువకుము"?
A ఉపకారములలో
B భూమి ఆకాశములలో
C మహిమైశ్వర్యములలో
D జ్ఞాన సంపదులలో
4Q. ఎవరి గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను "మరువకుండ" నీవు జాగ్రత్తపడుము?
A రాజుల
B ప్రవక్తల
C దాసుల
D దేవుని
5Q. ఏమి నొందు నీ వారిని నిత్యము "మరువకుము"?
A మేలు
B శ్రమ
C ప్రేమ
D కీడు
6 Q. ఎవరు నిత్యము "మరువ" బడరు?
A ప్రవక్తలు
B అధికారులు
C రాజులు
D దరిద్రులు
7 జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము వేటిని "మరువకుము"?
A దేవుని మాటలను
B ధర్మశాస్త్రము
C ప్రవచనములను
D సామెతలను
8 Q. ఏవి రెండు కాసులకు అమ్మబడును గాని వాటిలో ఒకటైనను దేవుని యెదుట "మరువ" బడదు?
A నాలుగు మేకలు
B రెండు పావురాళ్ళు
C అయిదు పిచ్చుకలు
D మూడు పక్షులు
9Q. ఏవి నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను "మరువ" లేదు?
A గర్వములు
B అహంకారములు
C దరిద్రములు
D భక్తిహీనులపాశములు
10 Q. దేవుడు మీతో చేసిన దేనిని "మరువకయు" ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను?
A నిబంధనను
B ప్రమాణము
C వాగ్దానము
D వాత్సల్యము
11.దేవుడైన యెహోవాకు ఎక్కడ కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసికొని, దాని "మరువ" వద్దు?
A ఐగుప్తులో
B కనానులో
C అరణ్యములో
D మోయాబులో
12Q. దేవుడు దేనినిగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన "మరువడు"?
A రక్షణ గూర్చి
B నిరపరాధులగూర్చి
C రక్తాపరాధము గూర్చి
D సత్యము గూర్చి
13Q. ఎన్నటికిని "మరువ" బడని ఏమి చేసికొని యెహోవాను కలిసికొందమని యూదావారు ఇశ్రాయేలువారు చెప్పుకొందురు?
A నిత్యనిబంధన
B న్యాయవిమర్శ
C జ్ఞానసంపద
D ఆత్మ విమర్శ
14. రాబోవు దినములలో ఎవరెవరు "మరువ" బడినవారై యుందురు?
A నీతిమంతులు, బానిసలు
B అధికారులు, దాసులు
C ప్రవక్తలు, విశ్వాసులు
D బుద్ధిహీనులు, జ్ఞానులు
15. యాకోబు యొక్క దేనితోడని, వారిక్రియలను నేనెన్నడును "మరువనని" యెహోవా ప్రమాణము చేసెను?
A విశ్వాసము
B అతిశయాస్పదము
C నిరీక్షణ
D జ్ఞానము
Result: