1. పెద్దదాని కంటే ముందుగా చిన్నదాని నిచ్చుట మా దేశ "మర్యాద"కాదని ఎవరితో లాబాను అనెను?
2. ఫరోకు పానదాయకుడవై యున్ననాటి "మర్యాద"చొప్పున అతని గిన్నెను అతని చేతికప్పగించెదవని ఎవరు ఆ అధిపతితో చెప్పెను?
3. ఎవరైనను నీకు నమస్కరించిన యెడల ప్రతి "మర్యాద"చేయకుండా దండము బాలుని ముఖము మీద పెట్టుమని ఎలీషా ఎవరితో అనెను?
4. రాజు ఎప్పటి "మర్యాద"చొప్పున స్తంభము దగ్గర నిలుచుట చూచిన ఎవరు ద్రోహము అని కేకలు వేసెను?
5. సకలజనుల "మర్యాద" చొప్పున మాకు రాజును నియమింపమని ఇశ్రాయేలీయులు ఎవరితో అనిరి?
6. నీవు మా యెడల చూపిన "మర్యాద" యెట్టిది?అని ఎవరు గిద్యోనుతో కలహించిరి?
7. సమ్సోను తండ్రి అతను పెండ్లి చేసుకొనే స్త్రీని చూడబోయినప్పుడు చేసిన ఏమి అచ్చటి "మర్యాద"?
8. ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన "మర్యాద"ఏదనగా ఒకడు ఏమి తీసి పొరుగువాని కిచ్చుటయే?
9. ఇశ్రాయేలు దేవుని "మర్యాద"ఏ రాజు పంపిన జనులకు తెలియకుండెను?
10. ఏ పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారు యెహోవా మాట వినక తమ పూర్వపు "మర్యాద" చొప్పుననే జరిగించుచు వచ్చిరి?
11. సమస్తమును "మర్యాద"గాను జరుగ నియ్యమని పౌలు ఏ సంఘమునకు చెప్పెను?
12. ఎవరు భక్తి "మర్యాదలు" గల స్త్రీలను రేపి పౌలు బర్నబాలకు హింస కలుగజేసిరి?
13. పగటియందు నడుచుకొనునట్టు "మర్యాదగా" నడుచుకొందము అని పౌలు ఏ సంఘముతో చెప్పెను?
14. సంఘమునకు వెలుపటి వారి యెడల "మర్యాదగా" నడుచుకొనవలెనని పౌలు ఏ సంఘముతో చెప్పెను?
15. ఈ లోక "మర్యాదను"అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై యున్న దేనిని పరీక్షించి తెలిసికొనవలెను?
Result: